Share News

Passengers Plane: పొరపాటున నదిపై ల్యాండ్ అయిన విమానం..తర్వాత ఏమైందంటే!

ABN , Publish Date - Dec 28 , 2023 | 07:39 PM

ఓ విమాన సిబ్బంది చిన్న పొరపాటు కారణంగా ఫ్లైట్ నదిపై ల్యాండ్ అయ్యింది. ఆ సమయంలో విమానంలో 30 మంది ఉండటంతోపాటు వారంతా సురక్షితంగా ఉండటం విశేషం. అయితే అసలు ఏం జరిగిందో ఇక్కడ చుద్దాం.

Passengers Plane: పొరపాటున నదిపై ల్యాండ్ అయిన విమానం..తర్వాత ఏమైందంటే!

ఓ ప్రయాణికుల విమానం పొరపాటున నదిపై ల్యాండ్ అయ్యింది. అవును మీరు విన్నది నిజమే. అయితే అసలు ఎందుకు అలా జరిగింది? ఎయిర్ పోర్టుకు చేరాల్సిన విమానం నదిపైకి ఎందుకు చేరింది. ఆ క్రమంలో విమానంలో ఉన్న ప్రయాణికులకు ఏమైనా ప్రాణహాని జరిగిందా అనే వివరాలను ఇప్పుడు చుద్దాం.


30 మంది ప్రయాణికులతో వెళ్తున్న రష్యాకు చెందిన ఆంటోనోవ్ 24 విమానం పైలెట్ తప్పిదం కారణంగా ఓ నదిపై ల్యాండ్ అయ్యింది. అయితే ఫ్లైట్ ల్యాండ్ అయిన సమయంలో ఆ నది గడ్డకట్టుకుపోయి ఉండటం విశేషం. ప్రస్తుతం చలికాలం కారణంగా ఆ ప్రాంతంలో ఉన్న నది మొత్తం గడ్డకట్టుకుపోయింది. దీంతో పొరపాటున పైలెట్ ఎయిర్ పోర్టు అనుకుని దాని సమీపంలో ఉన్న కొలిమా నది ప్రాంతంలో విమానాన్ని ల్యాండ్ చేశారు.

అయితే ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదని అక్కడి అధికారులు తెలిపారు. దీంతోపాటు ఫ్లైట్ కు కూడా ఎలాంటి ఇబ్బందులు ఏర్పడలేదని, సురక్షితంగా ఉందన్నారు. మరోవైపు ఆ సమయంలో విమానం దిగాల్సిన జైర్యాంక ఎయిర్ పోర్టు పూర్తిగా మంచుతో నిండిపోయిందని అక్కడి మీడియా తెలిపింది. అయితే శీతకాలంలో ఏర్పడిన తీవ్రమైన పొగమంచు కారణంగానే పైలెట్ పొరపాటు చేసినట్లు అధికారులు గుర్తించారు.

Updated Date - Dec 28 , 2023 | 07:42 PM