Share News

Israel- Hamas: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి అమెరికాలో ప్రతీకార దాడి.. పాపం ఆరేళ్ల బాలుడిని 26 సార్లు..

ABN , First Publish Date - 2023-10-16T12:48:42+05:30 IST

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధ ప్రభావం అగ్రరాజ్యం అమెరికాపై పడింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి సంబంధించిన ప్రతీకార దాడి ఒకటి అమెరికాలో కలకలం సృష్టించింది. ముస్లిం మతానికి చెందిన ఆరేళ్ల బాలుడు, అతని 32 ఏళ్ల తల్లిపై ఓ భూస్వామి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు.

Israel- Hamas: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి అమెరికాలో ప్రతీకార దాడి.. పాపం ఆరేళ్ల బాలుడిని 26 సార్లు..

వాషింగ్టన్: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధ ప్రభావం అగ్రరాజ్యం అమెరికాపై పడింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి సంబంధించిన ప్రతీకార దాడి ఒకటి అమెరికాలో కలకలం సృష్టించింది. ముస్లిం మతానికి చెందిన ఆరేళ్ల బాలుడు, అతని 32 ఏళ్ల తల్లిపై ఓ భూస్వామి విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. కత్తితో తల్లి కొడుకుపై పదులసార్లు దాడి చేశాడు. అలా ఆరేళ్ల బాలుడిని 26 సార్లు కత్తితో పొడిచాడు. భూస్వామి క్రూరమైన దాడిలో ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. అతని తల్లి మాత్రం ప్రాణాలతో బయటపడింది. ఈ విషయంపై ఇల్లినాయిస్ విల్ కౌంటీ షెరీఫ్ కార్యాలయ్యం ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘‘ఈ క్రూరమైన దాడిలో ఇద్దరు బాధితులు ముస్లింలే కావడం గమానర్హం. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి తల్లి కొడుకులను కారణాలుగా చూపుతూ వారిపై భూస్వామి దాడికి పాల్పడ్డాడు’’ అని డిటెక్టివ్‌లు వెల్లడించారు. అయితే బాధితులకు సంబంధించిన పూర్తి వివరాలను, జాతీయతను షెరీఫ్ కార్యాలయం వెల్లడించలేదు. కాకపోతే అమెరికన్-ఇస్లామిక్ రిలేషన్స్ చికాగో కార్యాలయం ఆ చిన్నారిని పాలస్తీనా-అమెరికన్‌గా చెప్పింది. అలాగే ఈ ఘటన పశ్చిమ చికాగోకు 64 కిలో మీటర్ల దూరంలో జరిగింది.


ఈ దాడిలో 71 ఏళ్ల భూస్వామి జోసెఫ్ జుబాగాతో పోరాడిన మరో మహిళ 911కు కాల్ చేసిందని షెరీఫ్ కార్యాలయం అధికారులు వెల్లడించారు. దీంతో పోలీస్ అధికారులు అక్కడికి చేరుకున్నారు. బాధితులిద్దరిని పోలీసులు ఆ భూస్వామి నివాసంలోని బెడ్ రూంలో గుర్తించారు. ఆసుపత్రికి తరలించగా ఆరేళ్ల బాలుడు చికిత్స పొందుతూ చనిపోయాడు. బాధితుల ఛాతీ, మొండెం, శరీరంపై అనేక కత్తి పోట్లు ఉన్నాయని షెరీఫ్ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. అలాగే పోస్ట్‌మార్టంలో బాలుడి పొత్తి కడుపు నుంచి ఏడు అంగుళాల బ్లేడుతో కూడిన మిలటరీ తరహా కత్తిని బయటకు తీశారని తెలిపింది. పోలీసులు ఘటన ప్రాంతానికి చేరుకున్నప్పుడు నుదిటిపై గాయంతో జుబా తన ఇంటి ముందు నేలపై కూర్చొని ఉన్నాడు. గాయపడిన నిందితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం నిందితుడిపై హత్య, హత్యాయత్నం, రెండు ద్వేహపూరిత నేరాల అభియోగాలు మోపారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు. జుబా బాధితుల తలుపు తట్టి వారిని ఉక్కిరిబిక్కిరి చేయడానికి ప్రయత్నించాడని సీఏఐఆర్ చికాగో కార్యాలయ అధిపతి అహ్మద్ రెహాబ్ విలేకరులతో తెలిపారు. మీరు ముస్లింలు అని, అందుకే చనిపోవాలని దాడి చేసినట్టు పేర్కొన్నారు. హత్యకు గురైన బాలుడి తండ్రికి మహిళ పంపిన మెసేజ్‌లతో ఈ విషయం బయటికొచ్చిందని చెప్పారు. ఈ దాడి "పీడకల" అని సీఏఐఆర్ ఒక ప్రకటనలో పేర్కొంది. బాలుడిని చంపడాన్ని "ద్వేషపూరితమైన భయంకరమైన చర్య"గా పేర్కొన్న యూఎస్ అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఖండించారు.

Updated Date - 2023-10-16T12:48:42+05:30 IST