Transformer explosion: తీవ్ర విషాదం.. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పేలి.. 15 మంది దుర్మరణం

ABN , First Publish Date - 2023-07-19T15:16:26+05:30 IST

ఉత్తరఖండ్‌లోని చమోలీ జిల్లాలో బుధవారం ఉదయం తీవ్ర విషాదం నెలకొంది. అలకనంద నది ఒడ్డునున్న నమామీ గంగ ప్రాజెక్ట్ సైట్‌ వద్ద విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో విద్యుదాఘాతంతో ఏకంగా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు.

Transformer explosion: తీవ్ర విషాదం.. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పేలి.. 15 మంది దుర్మరణం

చమోలి: ఉత్తరఖండ్‌లోని చమోలీ జిల్లాలో బుధవారం ఉదయం తీవ్ర విషాదం నెలకొంది. అలకనంద నది ఒడ్డునున్న నమామీ గంగ ప్రాజెక్ట్ సైట్‌ వద్ద విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోయింది. ఈ ప్రమాదంలో విద్యుదాఘాతంతో ఏకంగా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. మృతుల్లో ఒక పోలీస్ ఎస్ఐ, ముగ్గురు హోంగార్డులు కూడా ఉన్నారు. లోహ రెయిలింగ్‌ ద్వారా విద్యుత్ సరఫరా అవ్వడంతో ప్రాణాపాయం ఏర్పడినట్టు ప్రాథమిక సమాచారం ఉందని ‘లా అండ్ ఆర్డర్’ ఏడీజీ వీ మురుగేశన్ చెప్పారు. చమోలీ వ్యర్థపదార్థాల శుద్ధి ప్లాంట్‌కు సమీపంలో ఉదయం 11.35 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని వివరించారు.

గాయపడిన వారిలో ఇద్దరిని వాయుమార్గాన రిషికేశ్‌లోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తరలించినట్టు అధికారులు తెలిపారు. కాగా ఈ ఘటనపై సీఎం పుష్కర్ సింగ్ ధామీ విచారం వ్యక్తం చేశారు. మెజిస్ట్రీయల్ దర్యాప్తునకు ఆదేశించినట్టు వెల్లడించారు. రెస్క్యూ ఆపరేషన్ చర్యలు కొనసాగించాలని అధికారులను కోరారు. రాష్ట్ర, జిల్లా స్థాయి విపత్తు నిర్వహణ టీమ్‌లు ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్నాయని తెలిపారు.

Updated Date - 2023-07-19T15:27:22+05:30 IST