Share News

Jammu: సరిహద్దులో పాకిస్థాన్ రేంజర్ల కాల్పులు.. గాయపడ్డ బీఎస్ఎఫ్ జవాన్లు

ABN , First Publish Date - 2023-10-18T11:04:07+05:30 IST

సరిహద్దుల్లో పాక్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. భారత జవాన్లే టార్గెట్ గా బుల్లెట్ల వర్షం కురిపించింది. తాజాగా పాకిస్థాన్ రేంజర్లు భారత జవాన్లపై జరిపిన కాల్పుల్లో ఇద్దరుగాయపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మూ కశ్మీర్ లోని అంతర్జాతీయ సరిహద్దు వెంట భారత జవాన్లపై పాకిస్థాన్ రేంజర్లు అకస్మాత్తుగా దాడులు జరిపారు.

Jammu: సరిహద్దులో పాకిస్థాన్ రేంజర్ల కాల్పులు.. గాయపడ్డ బీఎస్ఎఫ్ జవాన్లు

ఢిల్లీ: సరిహద్దుల్లో పాక్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. భారత జవాన్లే టార్గెట్ గా బుల్లెట్ల వర్షం కురిపించింది. తాజాగా పాకిస్థాన్ రేంజర్లు భారత జవాన్లపై జరిపిన కాల్పుల్లో ఇద్దరుగాయపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మూ కశ్మీర్ లోని అంతర్జాతీయ సరిహద్దు వెంట భారత జవాన్లపై పాకిస్థాన్ రేంజర్లు అకస్మాత్తుగా దాడులు జరిపారు. అర్నియా సెక్టార్‌లోని విక్రమ్ పోస్ట్ వద్ద పాకిస్థాన్ రేంజర్లు సైనికులపై కాల్పులు జరిపారని, దీనికి ప్రతీకారంగా బీఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు జరిపారని సరిహద్దు భద్రతా దళం ఒక ప్రకటనలో తెలిపింది.


ఈ కాల్పుల్లో ఇద్దరు బీఎస్ఎఫ్ సిబ్బందికి బుల్లెట్ గాయాలయ్యాయి. వారికి వెంటనే వైద్య సహాయం అందించామని అధికారులు తెలిపారు. కాల్పుల ఘటనపై పాకిస్థాన్ రేంజర్లతో విచారణ జరిపి వారితో నిరసన తెలియజేస్తామని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇక్బాల్, ఖన్నార్ ఎదురుగా ఉన్న పాకిస్తాన్ పోస్ట్ నుండి ఇద్దరు బీఎస్ఎఫ్(BSF) జవాన్లను లక్ష్యంగా చేసుకొని దాడి చేయడానికి స్నిపర్‌ను ఉపయోగించినట్లు తెలుస్తోంది. కాల్పులు జరుగుతున్నప్పుడు జవాన్లు విద్యుత్తు సరఫరా సరిచేసే పనిలో ఉన్నట్లు అధికారులు చెప్పారు. భారత్, పాక్ లు ఫిబ్రవరి 25, 2021 న కాల్పుల విరమణ ఒప్పందంపై సంతకం చేశాయి. ఇందులో జమ్ము కశ్మీర్, నియంత్రణ రేఖ (LOC) వెంట కాల్పుల విరమణ ఒప్పందాలను కచ్చితంగా పాటించాలని రెండు దేశాలు అంగీకరించాయి.

Updated Date - 2023-10-18T11:04:07+05:30 IST