Karnataka: ఈద్లో ఘర్షణకు కారణమైన 43 మంది అరెస్ట్.. నిందితులపై చర్యలు తీసుకుంటామన్న సీఎం
ABN , First Publish Date - 2023-10-02T16:31:31+05:30 IST
కర్ణాటక(Karnataka)లోని శివమొగ్గ(Shivamogga) జిల్లా రాగిగుడ్డ సమీపంలో ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ ఊరేగింపుల సందర్భంగా రెండు వర్గాలు ఘర్షణ పడిన ఘటనలో పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ అంశాన్ని సీరియస్ తీసుకున్న సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah) కారకులను పట్టుకోవాలని ఆదేశించారు.
బెంగళూరు: కర్ణాటక(Karnataka)లోని శివమొగ్గ(Shivamogga) జిల్లా రాగిగుడ్డ సమీపంలో ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ ఊరేగింపుల సందర్భంగా రెండు వర్గాలు ఘర్షణ పడిన ఘటనలో పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ అంశాన్ని సీరియస్ తీసుకున్న సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah) కారకులను పట్టుకోవాలని ఆదేశించారు. ఆయన ఆదేశానుసారం రంగంలోకి దిగిన పోలీసులు సోమవారం 43 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో అన్ని మతాల వారు పరస్పరం గౌరవించుకోవాలని, ఇతర మతాల వారిని దూషించినా, అవాంచిత ఘటనలకు పాల్పడిన సహించేది లేదని స్పష్టం చేశారు. పరిస్థితి అదుపులో ఉందని తెలిపారు. రాగిగుడ్డలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. మిలాన్ ఉన్ నబీ ఊరేగింపు సమయంలో చెలరేగిన ఘర్షణను శాంతింపజేయడానికి పోలీసులు లాఠీ ఛార్జి చేశారు. ఈ ఘర్షణలో అయిదుగురు గాయపడ్డారు.