Manipur Riots: జంట హత్య కేసులో ఆరుగురి అరెస్ట్.. కఠినంగా శిక్షిస్తామన్న మణిపుర్ సీఎం
ABN , First Publish Date - 2023-10-01T19:38:19+05:30 IST
మణిపుర్(Manipur)లో తాజా హింసను కారణమైన ఇద్దరు మైతేయి(Meitei) ప్రేమికుల హత్యకు సంబంధించి ఇద్దరు మైనర్‌లతో సహా ఆరుగురిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు .
ఇంఫాల్: మణిపుర్(Manipur)లో తాజా హింసను కారణమైన ఇద్దరు మైతేయి(Meitei) ప్రేమికుల హత్యకు సంబంధించి ఇద్దరు మైనర్‌లతో సహా ఆరుగురిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఈశాన్య రాష్ట్రంలో కుకీ(Kuki)లకు మైతేయి తెగలకు మధ్య హింసాకాండ ఉద్ధృతంగా జరుగుతున్న సమయంలో ఇద్దరు ప్రేమికులను గుర్తు తెలియని వ్యక్తులు నరికి చంపారు. దీంతో ఆ రాష్ట్రంలో మళ్లీ ఆగ్రహావేశాలు పెలుబిక్కాయి. వారి మృతదేహాలకు సంబంధించిన ఫొటో ఇటీవల బయటికి వచ్చింది.
దీంతో శాంతి భద్రతలు(Law and Order) మళ్లీ చేయి దాటిపోయాయి. జులై 6న, 17 ఏళ్ల అమ్మాయి 20 ఏళ్ల యువకుడు కలిసి పారిపోయి కుకీ తెగలు ఉన్న ప్రాంతంలో చిక్కుకున్నారు. అక్కడ వీరిని హత్య చేశారు. హత్య నేపథ్యంలో అసత్య ప్రచారాలు వ్యాపిస్తాయనే కారణంతో ఇంటర్నెట్ పై బ్యాన్(Internet Ban) విధించారు. తిరిగి సెప్టెంబర్ 23న ఆంక్షలు ఎత్తివేయడంతో వీరి మృతదేహాల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనంతరం ఆందోళనలు మరింత ఉద్ధృతమయ్యాయి. ఈ క్రమంలో సీఎం బీరెన్ సింగ్(Biren Singh) ఈ ఘటనలపై ఎక్స్ లో "ఫిజామ్ హేమంజిత్, హిజామ్ లింతోంగంబి హత్యకు కారణమైన ప్రధాన నిందితులను చురచంద్‌పూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారికి కఠిన శిక్షలు పడేలా చూస్తాం" అని పోస్ట్ చేశారు. తరచూ ఘర్షణలు జరుగుతుండటంతో ఆ రాష్ట్రంపై కేంద్ర బలగాలు ఫోకస్ పెంచాయి.