Home » N. Biren Singh
జాతుల మధ్య ఘర్షణతో అట్టుడికి ఇప్పుడిప్పుడే తిరిగి కోలుకుంటున్న మణిపూర్ మరోసారి ఉలిక్కిపడింది. మయనార్మ్తో సరిహద్దులకు సమీపంలోని మోరే ప్రాంతంలో హెలిప్యాడ్ నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న పోలీసు అధికారి చింగ్తం ఆనంద్పై చొరబాటులు మంగళవారం ఉదయం కాల్పులకు తెగబడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు.
మణిపుర్(Manipur)లో హింసాత్మక ఘటనలు చల్లారట్లేదు. నిత్యం ఏదో ఓ చోట నిరసనకారులు(Protesters) ఆందోళనలు చేస్తూ.. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు.
మణిపుర్ హింస(Manipur Riots)పై ప్రధాని మోదీ స్పందించకుండా వివిధ రాష్ట్రాల్లో తిరుగుతూ రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్(Jairam Ramesh) విమర్శించారు.
మణిపుర్(Manipur)లో తాజా హింసను కారణమైన ఇద్దరు మైతేయి(Meitei) ప్రేమికుల హత్యకు సంబంధించి ఇద్దరు మైనర్లతో సహా ఆరుగురిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు .
రాష్ట్రంలో ఇద్దరు విద్యార్థుల(Students) దారుణ హత్య ఉదంతానికి సంబంధించిన వీడియోలు విడుదలైన తరువాత సీఎం బీరెన్ సింగ్(Biren Singh) పై ఆగ్రహజ్వాలలు మిన్నంటాయి. హత్యలను నిరసిస్తూ రాజధాని ఇంఫాల్(Imphal) లో ప్రజలు, విద్యార్థులు భారీ నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం కీలక ప్రకటన చేశారు. హత్యకు పాల్పడిన నిందితులను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టేది లేదని స్పష్టం చేశారు.
మణిపూర్లో హింసపై తప్పుడు, స్పా్న్సర్డ్ రిపోర్టు ఇచ్చారంటూ ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా సభ్యులపై ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు దిగింది. రాష్ట్రంలో ఉద్రిక్తతలు పెరిగేందుకు ఈజీఐ ప్రయత్నించిందని ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ ఆరోపించారు. గిల్డ్ మెంబర్లపై తమ ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసిందన్నారు.
మణిపూర్ హింసాత్మక ఘటనల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ సారథ్యంలోని ఎన్డీయే సర్కార్కు కుకీ పీపుల్స్ అలయెన్స్ షాక్ ఇచ్చింది. ఎన్డీయే భాగస్వామ్యం నుంచి వైదొలగుతున్నట్టు కేపీఏ ప్రకటించింది.
మణిపూర్లో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. బిష్ణుపూర్ జిల్లా, క్వాక్టా పట్టణంలో శుక్రవారం రాత్రి జరిగిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఇద్దరు తండ్రీకొడుకులు ఉన్నారు. ఈ తండ్రీకొడుకులిద్దరినీ ఉగ్రవాదులు కాల్చి చంపేసి, ఆ తర్వాత వారి మృతదేహాలను కత్తులతో ముక్కలు చేశారు.
మణిపూర్లో కుకీలు, మెయిటీల మధ్య ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి పోలీస్ స్టేషన్లపై దాడులు, ఆయుధాల దోపిడీలు విపరీతంగా జరుగుతున్నాయి. తాజాగా గురువారం బిష్ణుపూర్ జిల్లాలోని నరన్సీనా వద్ద ఉన్న ఇండియన్ రిజర్వు బెటాలియన్ (IRB) శిబిరంపై దాదాపు 500 మంది దాడి చేశారు.
మణిపూర్లో రెండు తెగల మధ్య జరుగుతున్న ఘర్షణల వెనుక విదేశీ ప్రమేయాన్ని కొట్టిపారేయలేమని భారత సైన్యం మాజీ అధిపతి జనరల్ ఎంఎం నరవనే (General MM Naravane) చెప్పారు. చాలా తిరుగుబాటు సంస్థలకు చైనా సహాయం అందుతోందని తెలిపారు. సరిహద్దుల్లోని రాష్ట్రాల్లో అస్థిరత వల్ల దేశ భద్రతకు శ్రేయస్కరం కాదన్నారు.