Aadhaar link: ఆ పథకానికి ఆధార్ లింక్ తప్పనిసరి కాదు
ABN , First Publish Date - 2023-07-15T10:22:06+05:30 IST
కాంగ్రెస్ గ్యారెంటీ పథకాల్లో అత్యంత ప్రముఖమైన గృహలక్ష్మి(Grilahakshmi) లబ్ధిదారులకు వెసులుబాటు కల్పిస్తూ మంత్రిమండలి గురువారం కీల
- మంత్రి మండలి తీర్మానం
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ గ్యారెంటీ పథకాల్లో అత్యంత ప్రముఖమైన గృహలక్ష్మి(Grilahakshmi) లబ్ధిదారులకు వెసులుబాటు కల్పిస్తూ మంత్రిమండలి గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డు తప్పనిసరిగా అనుసంధానం అయి ఉండాలని ప్రకటించిన ప్రభుత్వం తాజాగా ఇందుకు మినహాయింపు ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 22 లక్షల మంది అర్హులైన మహిళల ఆధార్ కార్డులు బ్యాంకు ఖాతాలతో అ నుసంధానం కాలేదని స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఈ ఖాతాలన్నింటికీ ఆధార్ అనుసంధానం జరిగేందుకు మరింత సమయం పడుతుందన్నారు. ఆగస్టు 15 నుంచి ఈ పథకాన్ని అమలు చేయాలని భావిస్తున్న ప్రభుత్వం బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం కాకపోయినా గృహలక్ష్మి పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చునని ప్రకటించింది.