All party meeting: ప్రతిపక్షాల కీలక భేటీకి ఒక్క రోజు ముందు కాంగ్రెస్ పార్టీకి ఆప్ ఊహించని షరతు
ABN , First Publish Date - 2023-06-22T20:02:27+05:30 IST
బిహార్‌లోని పట్నా వేదికగా శుక్రవారం (రేపు) నిర్వహించతలపెట్టిన కీలక ప్రతిపక్షాల భేటీకి (all party meeting) ఒక్క రోజు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో అధికారుల బదిలీలు, నియామకాల్లో లెఫ్టినెంట్ గవర్నర్‌ను తుది మధ్యవర్తిగా పేర్కొంటూ కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ (Congress party) తమకు మద్ధతివ్వకుంటే ప్రతిపక్షాల భేటీకి హాజరుకాబోమని ఆప్ (AAP) అల్టిమేటం విధించింది.
న్యూఢిల్లీ: బిహార్‌లోని పట్నా వేదికగా శుక్రవారం (రేపు) నిర్వహించతలపెట్టిన కీలక ప్రతిపక్షాల భేటీకి (all party meeting) ఒక్క రోజు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలో అధికారుల బదిలీలు, నియామకాల్లో లెఫ్టినెంట్ గవర్నర్‌ను తుది మధ్యవర్తిగా పేర్కొంటూ కేంద్రం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ (Congress party) తమకు మద్ధతివ్వకుంటే ప్రతిపక్షాల భేటీకి హాజరుకాబోమని ఆప్ (AAP) అల్టిమేటం విధించింది. విపక్షాల సమావేశంలో ఢిల్లీ ఆర్డినెన్స్‌కి తొలి సమస్యగా ప్రాధాన్యత ఇవ్వాలంటూ ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) లేఖ రాసిన తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.
ఢిల్లీ బిల్లు పాసైతే బీజేపీయేతర పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాలు కూడా ప్రభావితమవుతాయని, ఉమ్మడి జాబితాలోని రాష్ట్ర ప్రభుత్వ అధికారాల ఆక్రమణ జరుగుతుందని లేఖలో సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. అందుకే ప్రతిపక్ష పార్టీలు స్పష్టమైన రాజకీయ వైఖరిని కలిగివుండాలని, పరిపూర్ణమైన దృక్పథాన్ని కలిగివుండాలని విపక్ష నాయకులకు సూచించారు. కాగా ఈ లేఖ కంటే ముందు ఓ ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఢిల్లీ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా పార్టీలన్ని కలిసి వస్తాయని ఆశిస్తున్నట్టు చెప్పారు. అందుకే ఈ విషయంపై కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన వైఖరిని తెలపాలని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.