Rajasthan: రాజస్థాన్‌లో గెలుపు నల్లేరు మీద నడకే.. సీఓటర్ సర్వే ఏం చెప్పిందంటే..?

ABN , First Publish Date - 2023-10-09T21:15:11+05:30 IST

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్కంఠ కలిగిస్తున్న రాష్ట్రాల్లో ఒకటైన రాజస్థాన్‌ లో అధికార కాంగ్రెస్‌కు ఓటర్లు తిరిగి పట్టం కడతారా? లేకుంటే కమలవికాసం ఉంటుందా? అనే దానిపై ఏబీపీ-సీఓటర్ ఒపీనియన్ పోల్స్ సంచలన విషయాలు వెల్లడించింది. బీజేపీ గెలుపు నల్లేరు మీద నడకేనని సర్వే అంచనావేసింది.

Rajasthan: రాజస్థాన్‌లో గెలుపు నల్లేరు మీద నడకే.. సీఓటర్ సర్వే ఏం చెప్పిందంటే..?

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో (5 States Elections) ఉత్కంఠ కలిగిస్తున్న రాష్ట్రాల్లో ఒకటైన రాజస్థాన్‌ (Rajasthan)లో అధికార కాంగ్రెస్‌కు ఓటర్లు తిరిగి పట్టం కడతారా? లేకుంటే కమలవికాసం ఉంటుందా? అనే దానిపై ఏబీపీ-సీఓటర్ (ABP-CVoter) ఒపీనియన్ పోల్స్ సంచలన విషయాలు వెల్లడించింది. బీజేపీ గెలుపు నల్లేరు మీద నడకేనని సర్వే అంచనావేసింది.


సర్వే అంచనాల ప్రకారం, మొత్తం 200 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 127 నుంచి 137 సీట్లు గెలుచుకుంటుంది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 101 సీట్ల మెజారిటీ మార్క్‌ను బీజేపీ దాటనుంది. కాంగ్రెస్‌కు 59 నుంచి 69 సీట్లు దక్కే అవకాశం ఉంది. మొత్తం ఓట్లలో బీజేపీ 46 శాతం ఓటింగ్ షేర్‌ను రాబట్టుకోనుండగా, కాంగ్రెస్ 42 శాతం ఓటింగ్ షేర్‌తో నిలుస్తుంది. అక్టోబర్ తొలివారంలో ఈ సర్వే జరిగింది. కాగా, రాజస్థాన్‌లో నవంబర్ 23న పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి.

Updated Date - 2023-10-09T21:15:11+05:30 IST