Odisha train crash : ఒడిశా రైలు ప్రమాదం ప్రభావం.. రైల్వే బోర్డు కీలక నిర్ణయం..
ABN , First Publish Date - 2023-06-11T15:50:36+05:30 IST
రైళ్ల రాకపోకలకు సిగ్నల్స్ ఇచ్చే అన్ని వ్యవస్థలకు డబుల్ లాకింగ్ ఎరేంజ్‌మెంట్ చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. మెయింటెనెన్స్ వర్క్ పూర్తయిన
న్యూఢిల్లీ : రైళ్ల రాకపోకలకు సిగ్నల్స్ ఇచ్చే అన్ని వ్యవస్థలకు డబుల్ లాకింగ్ ఎరేంజ్‌మెంట్ చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. మెయింటెనెన్స్ వర్క్ పూర్తయిన తర్వాత రైళ్ల కదలికల ప్రారంభానికి సంబంధించిన ప్రోటోకాల్‌ను మరింత పటిష్టపరచాలని నిర్ణయించింది. ఒడిశాలో జూన్ 2న జరిగిన మూడు రైళ్ల ప్రమాదం నేపథ్యంలో ఈ నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు అన్ని రైల్వే జోన్లకు ఆదేశాలు జారీ చేసింది.
అన్ని రిలే రూమ్స్, ట్రైన్ కంట్రోలింగ్ మెకానిజమ్స్, టెలికమ్యూనికేషన్స్ ఎక్విప్‌మెంట్, పాయింట్, ట్రాక్ సర్క్యూట్ సిగ్నల్స్ వంటివాటన్నిటినీ డబుల్ లాకింగ్ చేయాలని రైల్వే బోర్డు అన్ని రైల్వే జోన్లను ఆదేశించింది. సిగ్నలింగ్ ఇంటర్‌ఫియరెన్స్‌కు చాలా ముఖ్యమైనది రిలే రూమ్ యాక్సెస్ అని తెలిపింది. జూన్ 2న బహనాగ రైల్వే స్టేషన్‌లో సిగ్నలింగ్ ఇంటర్‌ఫియరెన్స్ వల్ల కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ లూప్‌లైన్లోకి వెళ్లి, అక్కడ నిలిచి ఉన్న గూడ్స్ రైలును ఢీకొట్టిందని తెలిపింది. లెవెల్ క్రాసింగ్ గేట్ (గుమ్టీ/కేబిన్), హౌసింగ్ సిగ్నలింగ్, స్టేషన్ యార్డ్‌లోని టెలికమ్యూనికేషన్స్ ఎక్విప్‌మెంట్‌లను రిలే హట్‌గా పరిగణించాలని తెలిపింది. డబుల్ లాకింగ్ ఎరేంజ్‌మెంట్ అందుబాటులోకి వచ్చే వరకు ప్రస్తుత సింగిల్ లాక్ తాళాన్ని స్టేషన్ మాస్టర్ వద్ద ఉంచాలని తెలిపింది. ఈ తాళాన్ని సంబంధిత ఉద్యోగికి ఇవ్వడం, మళ్లీ దాన్ని తీసుకోవడానికి సంబంధించిన వివరాలను స్టేషన్ మాస్టర్ నమోదు చేయాలని తెలిపింది. స్టేషన్ రిలే రూమ్‌కు అనుసరిస్తున్న విధానాన్నే అనుసరించాలని తెలిపింది.
ఒడిశా రైలు ప్రమాదం తర్వాత సిగ్నలింగ్‌కు సంబంధించి జారీ చేసిన ఆదేశాల్లో ఇది మూడోది. ఈ ఆదేశాలు అన్ని రైళ్లకు వర్తిస్తాయని రైల్వే బోర్డు తెలిపింది. సిగ్నలింగ్ డిపార్ట్‌మెంట్, ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్ సంయుక్తంగా ఈ ఆదేశాలను జారీ చేశాయి.
రైల్వే ఉన్నతాధికారులు మాట్లాడుతూ, బహనాగ రైల్వే స్టేషన్ వద్ద జరిగిన మూడు రైళ్ల ప్రమాదానికి కారణం ఇంటర్‌లాకింగ్ సిస్టమ్ టాంపరింగ్ అవడమేనని రుజువు చేయడానికి తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయన్నారు. డబుల్ లాకింగ్ వల్ల ఈ లొకేషన్స్‌ను ఒంటరిగా ఎవరూ యాక్సెస్ చేయలేరన్నారు. ఈ ప్రమాదంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) దర్యాప్తు జరుపుతోంది.
ఇవి కూడా చదవండి :
Wrestlers : ఆధారాలివ్వండి : ఇద్దరు మహిళా రెజ్లర్లను కోరిన ఢిల్లీ పోలీసులు
Congress : కాంగ్రెస్‌కు అంతు చిక్కని సచిన్ పైలట్ వ్యవహారం