Pak Plane: భారత గగనతలంలోకి పాక్ విమానం...వైమానిక దళం నిఘా
ABN , First Publish Date - 2023-05-08T12:11:57+05:30 IST
పాక్ విమానం భారత గగనతలంలోకి ప్రవేశించడం కలకలం రేపింది...
న్యూఢిల్లీ: పాక్ విమానం భారత గగనతలంలోకి ప్రవేశించడం కలకలం రేపింది.పాక్ విమానం భారత గగనతలంలోకి ప్రవేశించడంతో వైమానిక దళం నిఘా వేసింది.(Air Force Kept Watch) పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ బోయింగ్ 777 జెట్‌లైనర్‌ను(Pak Plane) భారత వైమానిక దళం నిశితంగా పరిశీలిస్తోంది.(Pak Plane Entered Indian Airspace) పాకిస్థాన్ దేశంలోని లాహోర్ ప్రాంతంలో భారీ వర్షం కారణంగా(Poor Weather) లాహోర్ విమానాశ్రయంలో ల్యాండ్ కావడం విఫలమైంది.మస్కట్ నుంచి లాహోర్‌లోని అల్లామా ఇక్బాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరింది.ప్రతికూల వాతావరణం కారణంగా విమానం ల్యాండింగ్‌ను నిలిపివేయాల్సి వచ్చింది.
ఇది కూడా చదవండి : Breaking News:రాజస్థాన్‌లో కూలిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మిగ్-21 విమానం
జెట్‌లైనర్ ఎదుర్కొంటున్న పరిస్థితులపై ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌ను అప్రమత్తం చేశామని పాక్ పేర్కొంది.ప్రపంచవ్యాప్తంగా విమానాల కదలికలను పర్యవేక్షించే యాప్ ఫ్లైట్ రాడార్ 24లోని ట్రాకర్ పాక్ జెట్‌లైనర్ మే 4న భారత గగనతలంలోకి ప్రవేశించిన కొద్దిసేపటికే కనుగొంది. పంజాబ్‌లోని భిఖివింద్ పట్టణానికి ఉత్తరంగా రాత్రి 8.42 గంటలకు పాక్ విమానం ప్రయాణించింది.