Share News

Israel-Hamas: ఇజ్రాయెల్‌కి విమానాల రాకపోకలు బంద్.. ఎప్పటివరకంటే?

ABN , First Publish Date - 2023-10-14T16:02:06+05:30 IST

ఇజ్రాయెల్(Israel) లోని ముఖ్య పట్టణాల్లో ఒకటైన టెల్ అవివ్ కు అక్టోబర్ 14 వరకు విమానాల(Flights) రాకపోకల్ని నిలిపేస్తున్నట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా తాజాగా రద్దు తేదీని పొడగించింది.

Israel-Hamas: ఇజ్రాయెల్‌కి విమానాల రాకపోకలు బంద్.. ఎప్పటివరకంటే?

ఢిల్లీ: ఇజ్రాయెల్(Israel) లోని ముఖ్య పట్టణాల్లో ఒకటైన టెల్ అవివ్ కు అక్టోబర్ 14 వరకు విమానాల(Flights) రాకపోకల్ని నిలిపేస్తున్నట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా తాజాగా రద్దు తేదీని పొడగించింది. ఇజ్రాయెల్ - పాలస్థీనా(Israel - Palastine) మధ్య జరుగుతున్న భీకర పోరులో ఆ ప్రాంతాలు ప్రస్తుతానికి నివాసయోగ్యం కాదని అధికారులు హెచ్చరికల నేపథ్యంలో ఈ టైంలో ఇండియన్స్ అక్కడికి వెళ్లడం మంచిది కాదని భావించిన ఎయిర్ ఇండియా(Air India) ఫ్లైట్స్ రద్దు చేస్తున్నట్లు గతంలోనే ప్రకటించింది.


తాజాగా ఆ రద్దు తేదీని అక్టోబర్ 18వరకు పొడగించింది. ఢిల్లీ-టెల్ అవివ్(Delhi - Tel Aviv) ల మధ్య మరో నాలుగు రోజుల పాటు విమానాలు నడవవు. ఆ తరువాత కూడా యుద్ధ పరిస్థితులు ఆగకపోతే దీర్ఘకాలంలో విమానాలు రద్దు అయ్యే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. సాధారణంగా ఎయిర్ ఇండియా ఇరు దేశాల మధ్య వారానికి 5 రోజులు విమానాలు నడిపేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫ్లైట్స్ నడపడం సాధ్యం కాదని అధికారులు చెబుతున్నారు. ఆపరేషన్ అజయ్ పేరుతో ఇండియన్స్ ని తిరిగి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.


స్వదేశానికి తీసుకొచ్చేందుకు చార్టర్డ్ విమానాలు నడుపుతున్నారు. ఇప్పటికే 400 మంది వరకు ఇండియన్స్ తిరిగి వచ్చారు. ఈ ఆపరేషన్ చాలా రోజుల పాటు కొనసాగుతుందని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు. ఆ దేశంలో సుమారు 18 వేల మంది వరకు భారతీయులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇజ్రాయెల్ - పాలస్థీనా మధ్య జరుగుతున్న యుద్ధంలో వేల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.

Updated Date - 2023-10-14T16:04:11+05:30 IST