Air India: పైలట్ మహిళా స్నేహితురాలిని కాక్‌పిట్‌లోకి అనుమతించాడు...డీజీసీఏ విచారణ
ABN , First Publish Date - 2023-04-21T10:53:28+05:30 IST
ఎయిర్ ఇండియా విమాన పైలట్ కాక్‌పిట్‌లోకి మహిళా స్నేహితురాలిని అనుమతించిన ఘటన సంచలనం రేపింది....
న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా విమాన పైలట్ కాక్‌పిట్‌లోకి మహిళా స్నేహితురాలిని అనుమతించిన ఘటన సంచలనం రేపింది.(Air India pilot) ఫిబ్రవరి 27వతేదీన ఎయిర్ ఇండియా విమానం దుబాయ్ నుంచి ఢిల్లీకి వస్తుండగా ఈ ఘటన జరిగింది.ఈ ఘటన భద్రతా నిబంధనలను ఉల్లంఘించిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(Directorate General of Civil Aviation) (డీజీసీఏ) పేర్కొంది.
ఇది కూడా చదవండి : Russian city: ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలో రష్యా నగరంలో భారీ పేలుడు
ఎయిర్ ఇండియా పైలట్ ఒక మహిళా స్నేహితురాలిని(Allows woman friend) కాక్‌పిట్‌లోకి(Cockpit) అనుమతించి, ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) భద్రతా నిబంధనలను ఉల్లంఘించినట్లు క్యాబిన్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. పైలట్‌ను డ్యూటీ నుంచి తీసేశారా అనే దానిపై ఎలాంటి సమాచారం లేదు.ఇటీవల తరచూ విమానాల్లో భద్రత నిబంధనలను ఉల్లంఘిస్తున్న ఘటనలు జరుగుతున్నాయి.