Akasa Air: నోటీస్ ఇవ్వకుండా రాజీనామా చేశారని కోర్టును ఆశ్రయించిన విమాన సంస్థ
ABN , First Publish Date - 2023-09-20T19:20:10+05:30 IST
ఓ విమానాయాన సంస్థ తమ సంస్థ ఉద్యోగులు నోటీస్ చేయకుండా మానేశారని కోర్టు మెట్లెక్కింది. వివరాలు.. ఢిల్లీకి చెందిన ఆకాసా ఎయిర్(Akasa Air) అనే విమాన సంస్థ నుంచి ఆగస్టు 7, 2022లో పెద్ద ఎత్తున ఉద్యోగుల(Employees) రాజీనామా చేశారు.
ఏదైనా సంస్థలో జాబ్ మానేస్తున్నాం, లేదా జాబ్ టర్మినెట్ అవుతుందంటే తప్పనిసరిగా నోటీస్ పీరియడ్(Notice Period) లో వర్క్ చేయాల్సి ఉంటుంది. వ్యవధి కంపెనీ.. కంపెనీకి మధ్య తేడా ఉంటుంది. అయితే ఓ విమానాయాన సంస్థ తమ సంస్థ ఉద్యోగులు నోటీస్ చేయకుండా మానేశారని కోర్టు మెట్లెక్కింది. వివరాలు.. ఢిల్లీకి చెందిన ఆకాసా ఎయిర్(Akasa Air) అనే విమాన సంస్థ నుంచి ఆగస్టు 7, 2022లో పెద్ద ఎత్తున ఉద్యోగుల(Employees) రాజీనామా చేశారు. నోటీస్ పీరియడ్ చేయకుండా కంపెనీకి సమాచారం ఇవ్వకుండా వారంతా మానేశారు. దీంతో సెప్టెంబర్ వరకు పెద్ద సంఖ్యలో విమానాలు రద్దు చేయాల్సి వచ్చింది.
ప్రయాణికుల అవస్థలతో పాటు, కంపెనీ నష్టాల్లోకి వెళ్లిపోయింది. దీంతో కంపెనీ నోటిస్ చేయకుండా ఉద్యోగాలు మానేసిన పైలెట్లపై చర్యలు తీసుకునేలా డీజీసీఏ(DGCA)ను ఆదేశించాలని సంస్థ ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. దీంతో పాటు ఆదాయం కోల్పోయినందుకుగానూ ఉద్యోగుల నుంచి నష్టపరిహారం ఇప్పించాలని కోర్టుకు విన్నవించింది. స్పందించిన కోర్టు విచారణను ఈ నెల 22కి వాయిదా వేసింది.