Alcohol: మద్యం ప్రియులకు షాకిచ్చిన ప్రభుత్వం.. విషయమేంటంటే..

ABN , First Publish Date - 2023-07-08T11:44:49+05:30 IST

మద్యం ప్రియులకు సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) షాక్‌ ఇచ్చారు. బడ్జెట్‌లో అబ్కారీపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో

Alcohol: మద్యం ప్రియులకు షాకిచ్చిన ప్రభుత్వం.. విషయమేంటంటే..

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): మద్యం ప్రియులకు సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) షాక్‌ ఇచ్చారు. బడ్జెట్‌లో అబ్కారీపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో గ్యారెంటీల అమలు లక్ష్యంగా పెట్టుకున్న ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నింటిపైనా తన ప్రభావం చూపారు. ప్రత్యేకించి అబ్కారీపై 20 శాతం పన్ను పెంచారు. దేశీయ ఉత్పత్తి బ్రాండ్‌ల మద్యం (ఐఎంఎఫ్ఎల్‌)పై 20శాతం సుంకం పెంచారు. కాగా బీర్‌ బ్రాండ్‌లకు పదిశాతం సుంకం పెంచారు. ప్రస్తుతం ఉండే 175 శాతం పన్నులను 185కు పెంచారు. అన్ని స్లాబ్‌లపైనా 20 శాతం సుంకం పెంచారు. బీజేపీ ప్రభుత్వంలో రూ.35వేల కోట్ల లక్ష్యంగా పెట్టుకుని రూ.29వేల కోట్ల మేర సుంకం సేకరించారు. ప్రస్తుత బడ్జెట్‌లో రూ.36వేల కోట్ల అబ్కారీ పన్నులను లక్ష్యంగా పెట్టుకునారు.

Updated Date - 2023-07-08T11:44:49+05:30 IST