Flight Takes Off: 35 మంది ప్రయాణికులను వదిలివెళ్లిన అమృత్‌సర్-సింగపూర్ విమానం
ABN , First Publish Date - 2023-01-19T07:48:24+05:30 IST
తమను ఎక్కించుకోకుండానే విమానం సింగపూర్ కు వెళ్లిపోవడంతో ప్రయాణికులు షాక్‌కు గురైన...
అమృత్‌సర్ (పంజాబ్): తమను ఎక్కించుకోకుండానే విమానం సింగపూర్ కు వెళ్లిపోవడంతో ప్రయాణికులు షాక్‌కు గురైన ఘటన అమృత్‌సర్ విమానాశ్రయంలో వెలుగుచూసింది. అమృత్‌సర్ నుంచి సింగపూర్‌కు(Amritsar-Singapore flight) స్కూట్ ఎయిర్‌లైన్స్ విమానం(Scoot Airline Flight)నిర్ణీత సమయం కంటే ఐదు గంటలు ముందుగా బయలుదేరి వెళ్లింది. అమృత్‌సర్ విమానాశ్రయంలో 35 మంది ప్రయాణికులను వదిలిపెట్టి(Fliers Left Behind) స్కూట్ విమానం సింగపూర్ వెళ్లడంతో విమానాశ్రయంలో గందరగోళం ఏర్పడింది.
స్కూట్ ఎయిర్‌లైన్ విమానం బుధవారం రాత్రి 7.55 గంటలకు బయలుదేరాల్సి ఉండగా, అది మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరింది.(Takes Off Before Time)విమాన సమయం మార్పు గురించి ప్రయాణికులకు ఈ-మెయిల్ ద్వారా తెలియజేసినట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది.ఈ-మెయిల్‌ను పరిశీలించిన తర్వాత విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులతో విమానం ఎగిరిందని స్కూట్ పేర్కొంది.ఈ నెల ప్రారంభంలో బెంగళూరు విమానాశ్రయంలో 50 మందికి పైగా ప్రయాణీకులు లేకుండా గో ఫస్ట్ విమానం టేకాఫ్ కావడం కలకలం రేపింది.