Air India flight: కొచ్చిన్‌లో ఎయిర్ ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

ABN , First Publish Date - 2023-01-30T10:10:26+05:30 IST

కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 412 విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది.

Air India flight: కొచ్చిన్‌లో ఎయిర్ ఇండియా విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

కేరళ: కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం (Cochin International Airport)లో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 412 విమానం (Air India Express 412 flight) అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. షార్జా - కొచ్చిన్ విమానంలో హైడ్రాలిక్ వైఫల్యాన్ని పైలెట్ గుర్తించాడు. వెంటనే కొచ్చిన్ ఏటీసీకి సమాచారం ఇవ్వగా... ఎయిర్ పోర్ట్‌లో సిబ్బంది ఫుల్ ఎమర్జెన్సీని ప్రకటించింది. 25 నిమిషాల తరువాత కొచ్చిన్‌లో విమానాన్ని పైలెట్ సేఫ్‌గా ల్యాండ్ చేయడంతో ప్రయాణీకులు, ఎయిర్ పోర్ట్ వర్గాలు ఊపిరి పీల్చుకున్నారు. పైలెట్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించి విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేసి ప్రయాణికుల మన్ననలు పొందారు.

Updated Date - 2023-01-30T10:10:27+05:30 IST