FEMA Case : ఈడీ దర్యాప్తునకు హాజరైన అనిల్ అంబానీ సతీమణి టీనా
ABN , First Publish Date - 2023-07-04T11:12:16+05:30 IST
పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ (Anil Ambani) సతీమణి టీనా అంబానీ మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తునకు హాజరయ్యారు.
న్యూఢిల్లీ : పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ (Anil Ambani) సతీమణి టీనా అంబానీ (Tina Ambani) మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) దర్యాప్తునకు హాజరయ్యారు. విదేశీ మారక ద్రవ్య చట్టం నిబంధనలను ఉల్లంఘించినట్లు నమోదైన కేసులో ఆమెను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అనిల్ అంబానీని ఈ కేసులో సోమవారం ఈడీ ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
అనిల్ అంబానీకి చెందిన కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన తాజా కేసు ఇది. దీనిని విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (FEMA), 1999 ప్రకారం దాఖలు చేశారు.
యెస్ బ్యాంక్ (Yes Bank) ప్రమోటర్ రాణా కపూర్, తదితరులపై నమోదైన మనీలాండరింగ్ కేసులో అనిల్ అంబానీ 2020లో ఈడీ సమక్షంలో హాజరయ్యారు. గత ఏడాది ఆగస్టులో ఆదాయపు పన్ను శాఖ అనిల్ అంబానీకి నోటీసు ఇచ్చింది. రెండు స్విస్ బ్యాంక్ ఖాతాల్లో రూ.814 కోట్లకుపైగా నిధులు ఉన్నాయని, వాటి గురించి ప్రభుత్వానికి ఆయన వెల్లడించలేదని, రూ.420 కోట్ల మేరకు పన్ను ఎగవేశారని ఆరోపిస్తూ, యాంటీ బ్లాక్ మనీ చట్టం ప్రకారం ఆయనకు ఈ నోటీసు ఇచ్చింది. అయితే ఆయనపై నిర్బంధ చర్యలు తీసుకోవద్దని గత ఏడాది సెప్టెంబరులో బోంబే హైకోర్టు ఆదాయపు పన్ను శాఖను ఆదేశించింది.
ఇవి కూడా చదవండి :
Khalistan terrorists : సిక్కు తీవ్రవాదుల నిరసనలపై కెనడాను హెచ్చరించిన భారత్
Maha Congress : మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేల సమావేశం మరికాసేపట్లో