Hindu Rashtra : భారత్‌ను హిందూ దేశంగా ప్రకటించాలి : అనూప్ జలోటా
ABN , First Publish Date - 2023-02-15T20:46:33+05:30 IST
భక్తి గీతాల గాయకుడు అనూప్ జలోటా (Anup Jalota) సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువుల (Hindus) జనాభా
న్యూఢిల్లీ : భక్తి గీతాల గాయకుడు అనూప్ జలోటా (Anup Jalota) సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందువుల (Hindus) జనాభా అధికంగా ఉన్నందువల్ల భారత దేశాన్ని హిందూ దేశంగా పరిగణించాలని అన్నారు. దీనివల్ల ఎవరికీ ఏ ఇబ్బంది ఉండదన్నారు. ఆయన వ్యాఖ్యలతో కూడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.
భారత దేశంలో హిందువుల జనాభా ఎక్కువగా ఉన్నందువల్ల దీనిని హిందూ దేశంగా పరిగణించాలని అనూప్ జలోటా అన్నారు. దీనివల్ల ఎవరికీ ఎటువంటి ఇబ్బంది ఉండదన్నారు. జమ్మూ-కశ్మీరు విషయంలో చేసినట్లుగానే కేవలం ఓ ప్రకటన చేస్తే సరిపోతుందన్నారు. జమ్మూ-కశ్మీరులో ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గాయని, శాంతి ఏర్పడిందని అన్నారు.
ప్రపంచంలో హిందువులకు ఓ దేశం లేదన్నారు. నేపాల్ గతంలో హిందూ దేశంగా ఉండేదని, కానీ దానిని ఇక హిందూ దేశం అని పిలవడం సాధ్యం కాదని అన్నారు. భారత దేశంలో హిందువులు అధికంగా ఉన్నారని, ఈ డిమాండ్‌ను వినిపించేవారి సంఖ్య పెరుగుతోందని తెలిపారు. భారత దేశం నుంచి పాకిస్థాన్ విడిపోయినపుడు, అక్కడ ముస్లింలు ఎక్కువగా ఉండటంతో ఆ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా ప్రకటించారని తెలిపారు. భారత దేశాన్ని కూడా హిందూ దేశంగా అప్పట్లోనే ప్రకటించి ఉండవలసిందన్నారు. అప్పుడు అలా జరగలేదు కాబట్టి ఇప్పుడు జరగాలన్నారు.
మధ్యప్రదేశ్‌లోని బాగేశ్వర్ ధామ్ చీఫ్ ధీరేంద్ర శాస్త్రి మన దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అనూప్ జలోటా ఇటీవల శాస్త్రిని కలిశారు.
ఇవి కూడా చదవండి:
Karnataka: కర్ణాటక బీజేపీ చీఫ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు
Kishan Reddy: సీఎం కేసీఆర్‌ను కిషన్‌రెడ్డి ఏం కోరారంటే..?