Amritsar : స్వర్ణ దేవాలయం పరిసరాల్లో రెండవ పేలుడు
ABN , First Publish Date - 2023-05-08T10:06:25+05:30 IST
అమృత్సర్లోని హెరిటేజ్ స్ట్రీట్లో సోమవారం ఉదయం మరో పేలుడు సంభవించింది....
అమృత్సర్(పంజాబ్): అమృత్సర్లోని హెరిటేజ్ స్ట్రీట్లో సోమవారం ఉదయం మరో పేలుడు సంభవించింది.(Amritsar heritage street) గోల్డెన్ టెంపుల్కు వెళ్లే మార్గంలో సారాగర్హి సరాయ్ సమీపంలోని హెరిటేజ్ స్ట్రీట్లో పేలుడు సంభవించింది.(Another explosion)సోమవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పోలీసు కమిషనర్ సహా పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని పరీక్షల కోసం నమూనాలను సేకరిస్తున్నారు.ఈ పేలుడులో ఎవరూ గాయపడలేదు.
ఇది కూడా చదవండి : Peru: గోల్డ్ మైన్ అగ్ని ప్రమాదం... 27 మంది మృతి
గోల్డెన్ టెంపుల్(Golden Temple) పరిసరాల్లోని గత 24 గంటల్లో హెరిటేజ్ స్ట్రీట్లో ఇదే ప్రదేశానికి సమీపంలో పేలుడు సంభవించడం ఇది రెండోసారి.పేలుడు శబ్దం సమీపంలోని స్థానికులకు వినిపించింది. పేలుడు తర్వాత ఆ ప్రాంతంలో పొగలు కూడా కనిపించాయి.హెరిటేజ్ స్ట్రీట్ పార్కింగ్ స్థలంలో గుర్తు తెలియని వ్యక్తులు పేలుడు పదార్థాన్ని, బాంబును దారంతో వేలాడదీయడంతో పేలుడు సంభవించింది.ఈ పేలుడు ఘటనపై పోలీసుల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.