Siachen glacier: సియాచిన్ గ్లేసియర్‌లో అగ్నిప్రమాదం, ఆర్మీ అధికారి మృతి, ముగ్గురికి గాయాలు
ABN , First Publish Date - 2023-07-19T19:28:51+05:30 IST
సియాచిన్ గ్లేసియర్ లో బుధవారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో ఒక ఆర్మీ అధికారి ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. వీరిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్టు లెహ్ డిఫెన్స్ పీఆర్ఓ లెఫ్టినెంట్ కల్నర్ పీఎస్ సిద్ధు ఒక ప్రకటనలో తెలిపింది. తెల్లవారుజామున 3 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.
న్యూఢిల్లీ: సియాచిన్ గ్లేసియర్ (Siachen glacier)లో బుధవారం తెల్లవారుజామున మంటలు చెలరేగడంతో ఒక ఆర్మీ అధికారి ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. వీరిని వెంటనే ఆసుపత్రికి తరలించినట్టు లెహ్ డిఫెన్స్ పీఆర్ఓ లెఫ్టినెంట్ కల్నర్ పీఎస్ సిద్ధు ఒక ప్రకటనలో తెలిపింది. తెల్లవారుజామున 3 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.
ఈ దురదృష్టకర ఘటనలో రెజిమెంట్ మెడికల్ ఆఫీసర్ కెప్టెన్ అన్షుమాన్ సింగ్ తీవ్రంగా గాలిన గాయాలతో మరణించారు. తక్కిన ముగ్గురు పొగ లోపలకి పోవడం, సెకెండ్ డిగ్రీ గాయాలకు గురైనట్టు అధికారులు చెప్పారు. వారిని వెంటనే హెలికాప్టర్‌లో చికిత్స కోసం తరలించినట్టు తెలిపారు. వీరి పరిస్థితి నిలకడగా ఉంది. సియాచిన్‌లో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సైనికులు పనిచేస్తుంటారు. తరచు హిమపాతాలు సంభవిస్తుంటాయి. ఇక్కడ ఒక్కో జవానుతు మూడు నెలలు మాత్రమే విధులు కేటాయిస్తుంటారు. తీవ్ర ప్రతికూల పరిస్థితులు, శత్రువుల కాల్పుల్లో గత 37 ఏళ్లలో సుమారు 800 మంది జవాన్లు సియాచిన్‌లో ప్రాణాలు కోల్పోయారు.