Aryan Khan case: ఆర్యన్‌ఖాన్‌పై కేసు నమోదు చేసిన ఎన్సీబీ అధికారి డిస్మిస్

ABN , First Publish Date - 2023-05-10T12:09:04+05:30 IST

షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ప్రమేయం ఉన్న అధికారిని సర్వీస్ నుంచి తొలగించారు....

Aryan Khan case: ఆర్యన్‌ఖాన్‌పై కేసు నమోదు చేసిన ఎన్సీబీ అధికారి డిస్మిస్
officer Sacked by NCB

ముంబయి: షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ప్రమేయం ఉన్న అధికారిని సర్వీస్ నుంచి తొలగించారు.(Aryan Khan case)ఇంటర్నేషనల్ క్రూయిజ్ టెర్మినల్‌లో కోర్డెలియా క్రూజ్‌పై ఎన్సీబీకి చెందిన అప్పటి ముంబై జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే నేతృత్వంలోని బృందం దాడి చేసిన తర్వాత ఆర్యన్ ఖాన్, ఇతరులను అరెస్టు చేశారు.2021వ సంవత్సరంలో నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను అరెస్టు చేసిన బృందంలో భాగమైన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో లేదా ఎన్‌సిబి దాని సూపరింటెండెంట్ విశ్వ విజయ్ సింగ్‌ను(Vishwa Vijay Singh) ఉద్యోగం నుంచి తొలగించింది.విజయ్ సింగ్ ను డిస్మిస్ చేస్తూ గత నెలలో ఉత్తర్వులు జారీ చేసినట్లు ఓ ఎన్సీబీ అధికారి బుధవారం తెలిపారు.

గత సంవత్సరం సస్పెండ్ అయిన విశ్వ విజయ్ సింగ్‌ను మరో కేసులో ఎన్‌సీబీ సర్వీస్ నుంచి తొలగించారు.22 రోజులు జైలులో గడిపిన ఆర్యన్ ఖాన్‌కు మే 2022లో తగిన సాక్ష్యాలు లేనందున ఎన్సీబీ క్లీన్ చిట్ ఇచ్చింది. ఎన్‌సిబి టీమ్, సమీర్ వాంఖడేపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ప్రత్యేక విజిలెన్స్ విచారణ జరిగింది.డ్రగ్స్ ఆన్ క్రూయిజ్ కేసులో ఏడుగురు అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. సమీర్ వాంఖడేను చెన్నైలోని డీజీ పన్ను చెల్లింపుదారుల సేవా డైరెక్టరేట్‌కు బదిలీ చేసినట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2023-05-10T12:12:56+05:30 IST