Gyanvapi : జ్ఞానవాపిలో ఏఎస్ఐ సర్వే ప్రారంభం.. బహిష్కరించిన ముస్లిం పక్షం..

ABN , First Publish Date - 2023-08-04T09:20:48+05:30 IST

ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో సైంటిఫిక్ సర్వేను ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (Archaeological Survey of India-ASI) శుక్రవారం ఉదయం ప్రారంభించింది. 17వ శతాబ్దంనాటి ఈ మసీదును అంతకన్నా ముందే నిర్మించిన హిందూ దేవాలయంపైన నిర్మించారా? అనే అంశాన్ని నిర్థరించేందుకు ఈ సర్వే జరుగుతోంది.

Gyanvapi : జ్ఞానవాపిలో ఏఎస్ఐ సర్వే ప్రారంభం.. బహిష్కరించిన ముస్లిం పక్షం..

న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో సైంటిఫిక్ సర్వేను ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (Archaeological Survey of India-ASI) శుక్రవారం ఉదయం ప్రారంభించింది. 17వ శతాబ్దంనాటి ఈ మసీదును అంతకన్నా ముందే నిర్మించిన హిందూ దేవాలయంపైన నిర్మించారా? అనే అంశాన్ని నిర్థరించేందుకు ఈ సర్వే జరుగుతోంది.

వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పును అలహాబాద్ హైకోర్టు గురువారం సమర్థించింది. న్యాయం కోసం ఇక్కడ సైంటిఫిక్ సర్వే నిర్వహించడం అవసరమని, దీనివల్ల ఇరు పక్షాలకు ప్రయోజనం కలుగుతుందని తెలిపింది. దీంతో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈ సైంటిఫిక్ సర్వే జరుగుతోంది.

వారణాసి జిల్లా కోర్టు ఈ ప్రాంగణంలో సైంటిఫిక్ సర్వేకు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు జూలై 24న తాత్కాలికంగా నిలిపేసింది. దీనిపై విచారణ జరిపి, తగిన తీర్పు వెల్లడించాలని అలహాబాద్ హైకోర్టును ఆదేశించింది. హైకోర్టు గురువారం తీర్పు చెప్తూ, సైంటిఫిక్ సర్వేను నిర్వహించాలని ఆదేశించింది.


ముస్లిం పక్షం అంజుమన్ ఇంతెజామియా మస్జిద్ కమిటీ ఈ సర్వేకు హాజరుకాలేదు. ఈ కమిటీ జాయింట్ సెక్రటరీ ఎస్ఎం యాసిన్ మాట్లాడుతూ, మసీదుకు ఎటువంటి నష్టం జరగకుండా సైంటిఫిక్ సర్వేను నిర్వహించాలని హైకోర్టు ఏఎస్ఐని ఆదేశించిందన్నారు. తాము హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టులో సవాల్ చేశామన్నారు. దీనిపై సుప్రీంకోర్టు విచారణ శుక్రవారం (ఆగస్టు 4న) జరుగుతుందన్నారు.

వారణాసి జిల్లా మేజిస్ట్రేట్ ఎస్ రాజలింగం మాట్లాడుతూ, ఈ సర్వేను శుక్రవారం నుంచి ప్రారంభించేందుకు స్థానిక అధికార యంత్రాంగం సహకారం కావాలని ఏఎస్ఐ అధికారులు కోరారని తెలిపారు. తాము వారణాసి పోలీస్ కమిషనర్‌తో సవివరంగా చర్చించామని చెప్పారు. జిల్లా అధికార యంత్రాంగం ఈ సర్వేకు సంపూర్ణంగా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.


ఇవి కూడా చదవండి :

Chief Minister: ఆ కాల్వలను త్వరగా పూర్తి చేయండి

Enforcement Directorate: నగరంలో మళ్లీ.. ఈడీ ప్రకంపనలు

Updated Date - 2023-08-04T09:20:48+05:30 IST