Northeastern India : మోదీ కోసం ఈశాన్య భారతం ఏకమవుతుంది : హిమంత బిశ్వ శర్మ
ABN , First Publish Date - 2023-08-09T15:41:19+05:30 IST
ఈశాన్య భారతంలోని రాష్ట్రం మణిపూర్‌లో మూడు నెలల నుంచి హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నప్పటికీ ఈ ప్రాంతంలోని రాష్ట్రాలన్నీ ఓ విషయంలో ఏకతాటిపైకి వస్తాయని అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీని మూడోసారి ప్రధాన మంత్రిని చేయడానికి ఈశాన్య రాష్ట్రాలన్నీ ఏకమవుతాయని చెప్పారు.
గువాహటి : ఈశాన్య భారతంలోని రాష్ట్రం మణిపూర్‌లో మూడు నెలల నుంచి హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నప్పటికీ ఈ ప్రాంతంలోని రాష్ట్రాలన్నీ ఓ విషయంలో ఏకతాటిపైకి వస్తాయని అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ ధీమా వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీని మూడోసారి ప్రధాన మంత్రిని చేయడానికి ఈశాన్య రాష్ట్రాలన్నీ ఏకమవుతాయని చెప్పారు.
ఈశాన్య భారతంలోని రాష్ట్రాలకు సంబంధించిన ‘విస్తారక్’ సమావేశంలో శర్మ మాట్లాడుతూ, మణిపూర్‌లో బీజేపీ విజయావకాశాల గురించి చాలా మంది అడుగుతున్నారని, రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలోని అన్ని (2) లోక్ సభ స్థానాలను బీజేపీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం ఘర్షణలు జరుగుతున్నప్పటికీ, మోదీని మూడోసారి ప్రధాన మంత్రి చేసే విషయంలో యావత్తు ఈశాన్య భారతం ఏకమవుతుందన్నారు.
మోదీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల నిత్యావసరాల ధరలు మణిపూర్‌లో 2012లో పెరిగినంత స్థాయిలో పెరగలేదన్నారు. 2012లో వివిధ డిమాండ్లతో అనేక సంస్థలు జాతీయ రహదారులను సుదీర్ఘ కాలంపాటు నిర్బంధించిన విషయాన్ని గుర్తు చేశారు. సిల్చార్-జిరిబామ్ రోడ్డును నిర్మించి ఉండకపోతే, నేటి పరిస్థితుల్లో పెట్రోలు, డీజిల్ ధరలు లీటరు రూ.1,000కి చేరి ఉండేవన్నారు. 2012లో ఈ రోడ్డు లేదని తెలిపారు. అప్పట్లో నిత్యావసర వస్తువులను విమానాల్లో ఇంఫాల్‌కు తీసుకెళ్లేవారని, అందువల్ల అప్పట్లో లీటరు పెట్రోలు, డీజిల్ ధర రూ.350 నుంచి రూ.400 వరకు ఉండేదని చెప్పారు. ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు కూడా అప్పటి స్థాయిలో పెరగలేదన్నారు. ఇంఫాల్ లోయకు సరఫరా మార్గాన్ని సురక్షితంగా ఉంచినట్లు తెలిపారు.
ఈశాన్య భారతంలోని ఎనిమిది రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒకటి నుంచి 14 లోక్ సభ స్థానాలు ఉన్నాయన్నారు. అన్నిటినీ కలిపితే 25 లోక్ సభ స్థానాలు ఉన్నాయని, వీటికి దేశ రాజకీయ యవనికపై చెప్పుకోదగ్గ స్థానం ఉందని తెలిపారు. మనమంతా కలిస్తే పాజిటివ్ ప్రభావాన్ని చూపగలమని తెలిపారు. లోక్ సభ స్థానాల విషయంలో ఈ ప్రాంతాన్ని సమష్టిగా చూడాలని బీజేపీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఇవి కూడా చదవండి :
Uttar Pradesh : యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం.. ఈసారి ఎమ్మెల్యేల వంతు..
Uttar Pradesh : యోగి ఆదిత్యనాథ్ మరో సంచలన నిర్ణయం.. ఈసారి ఎమ్మెల్యేల వంతు..