Nuh Violence: ప్లాన్ ప్రకారమే దాడి.. నూహ్ అల్లర్ల వెనుక పెద్ద కుట్ర ఉంది: సీఎం ఖట్టర్

ABN , First Publish Date - 2023-08-01T18:10:40+05:30 IST

హర్యానాలోని నుహ్ జిల్లాలో కొనసాగుతున్న అల్లర్ల వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ అనుమానం వ్యక్తం చేశారు. ప్లాన్ ప్రకారమే.. ప్రతి ఏటా నిర్వహించే విశ్వ హిందూ పరిషత్ యాత్రను అడ్డుకొని, దాడి చేశారని వ్యాఖ్యానించారు.

Nuh Violence: ప్లాన్ ప్రకారమే దాడి.. నూహ్ అల్లర్ల వెనుక పెద్ద కుట్ర ఉంది: సీఎం ఖట్టర్

హర్యానాలోని నుహ్ జిల్లాలో కొనసాగుతున్న అల్లర్ల వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ అనుమానం వ్యక్తం చేశారు. ప్లాన్ ప్రకారమే.. ప్రతి ఏటా నిర్వహించే విశ్వ హిందూ పరిషత్ యాత్రను అడ్డుకొని, దాడి చేశారని వ్యాఖ్యానించారు. ఈ ఘర్షణ కారణంగా ఇప్పటివరకూ 5 మంది (ఇద్దరు పోలీసులు, ముగ్గురు వ్యక్తులు) ప్రాణాలు కోల్పోయారని.. నుహ్‌కి చెందని వ్యక్తులు ఈ దాడి వెనుక ఉన్నారన్న విషయాన్ని గుర్తించామని సీఎం తెలిపారు. ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమన్న ఆయన.. సమాచారం అందిన వెంటనే సీనియర్ పోలీస్ అధికారులతో పాటు అడ్మినిష్ట్రేషన్‌ను సంఘటనా స్థలానికి పంపించడం జరిగిందన్నారు. ఈ ఘటనపై పలు ఎఫ్ఐఆర్‌లు నమోదు అయ్యాయని, ఇప్పటిదాకా 70 మందికి అదుపులోకి తీసుకున్నామన్నారు. రాష్ట్ర ప్రజలంతా సంయమనం పాటించాలని, బాధ్యుల్ని కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.


కాగా.. సోమవారం నుహ్‌లో విశ్వ హిందు పరిషత్ వారు యాత్ర నిర్వహించగా, మరో వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు దాన్ని అడ్డుకున్నారు. ఇదే.. రెండు వర్గాల మధ్య ఘర్షణకు పునాది వేసింది. ఇరువర్గాల వారు ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ అల్లర్లని అదుపు చేసేందుకు పోలీసులు భాష్ఫవాయువు ప్రయోగించారు. ఒక సంస్థకు చెందిన వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టిన వీడియోనే.. ఈ అల్లర్లకు కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు.. ఈ అల్లర్లు నుహ్ పక్కనే ఉన్న ఇతర ప్రాంతాలకు (గురుగ్రామ్) వ్యాపించాయి. మంగళవారం కూడా ఘర్షణ వాతావరణం ఉన్న నేపథ్యంలో కర్ఫ్యూ విధించారు. వదంతులు వ్యాప్తి చెందితే, పరిస్థితులు చెయ్యి దాటిపోతాయనే ఉద్దేశంతో.. బుధవారం అర్థరాత్రి వరకు ఇంటర్నెట్‌పై ఆంక్షలు విధించారు.

Updated Date - 2023-08-01T18:10:40+05:30 IST