Bengalore Metro: ఇటీవల ప్రధాని మోదీ ప్రారంభించిన మెట్రోస్టేషన్‌లోకి వర్షపు నీరు

ABN , First Publish Date - 2023-04-05T14:05:07+05:30 IST

మంగళవారం కురిసిన వర్షానికి బెంగళూరులోని ఓ మెట్రోస్టేషన్‌లోకి వర్షపు నీరు చేరింది. ఇటీవల ప్రధాని మోదీ(Prime Minister Narendra Modi ) ప్రారంభించిన(inaugurated) నల్లూర్‌హళ్లి మెట్రోస్టేషన్‌(Nallurhalli Metro Station)లోకి..

Bengalore Metro: ఇటీవల ప్రధాని మోదీ ప్రారంభించిన మెట్రోస్టేషన్‌లోకి వర్షపు నీరు

బెంగళూరు: మంగళవారం కురిసిన వర్షానికి బెంగళూరులోని ఓ మెట్రోస్టేషన్‌లోకి వర్షపు నీరు చేరింది. టికెట్ కౌంటర్ల దగ్గర చేరిన వర్షపు నీటిని సిబ్బంది తొలగిస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల ప్రధాని మోదీ(Prime Minister Narendra Modi ) ప్రారంభించిన (Inaugurated) నల్లూర్‌హళ్లి మెట్రోస్టేషన్‌(Nallurhalli Metro Station)లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. కాగా రెండోదశ బెంగళూరు(Bengalore) మెట్రోవిస్తరణలో భాగంగా 13.71 కిలోమీటర్ల మేర ఈ మెట్రో స్టేషన్‌ను మార్చి 25న ప్రధాని మోదీ ప్రారంభించారు.

కాగా నల్లూర్‌హళ్లీ మెట్రోస్టేషన్ పూర్తి కాకముందే ప్రారంభించడంపై గతంలో కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు రణదీప్‌సింగ్ తీవ్రంగా స్పందించారు. బైయప్పనహళ్లి మెట్రో స్టేషన్‌, కేఆర్‌‌పురం మెట్రోస్టేషన్‌ మధ్య తప్పనిసరి మెట్రోలింక్‌ను నిర్మించకుండానే ప్రధాని మోదీ పర్పుల్‌ మెట్రో లైన్‌ను ఎందుకు ప్రారంభిస్తున్నారు? అని ప్రశ్నించారు.

మంగళవారం సాయంత్రి కురిసిన భారీ వర్షాలకు వైట్‌ఫీల్డ్ ఏరియాలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. మహదేవపూర్ పరిసర ప్రాంతాలు, ఐటీపీఎల్ మెయిన్ రోడ్డు, వర్తూర్ కోడి ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. భారీ వర్షం కారణంగా ఐటీపీఎల్ ప్రధాన రహదారి, వర్తుర్ కోడి తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది.

కాగా భారీ వర్షాలతో బెంగళూరు సిటీలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్తూర్ కోడి, కడుబీసన్‌హళ్లి ప్రాంతాలు వర్షపు నీటితో నిండిపోయాయి. వర్షం కారణంగా బెంగళూరులో వాతావరణం సరిగా లేనందున 8 విమానాలను దారి మళ్లించారు. బెంగళూరు నుంచి బయల్దేరాల్సిన 6 విమానాలు ఆలస్యంగా నడిచాయి.

రాగల 48 గంటల్లో సాయంత్రం, రాత్రి సమయాల్లో ఉరుములతో కూడిన జల్లులు, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని బెంగళూరు వాతావరణ శాఖ తెలిపింది. ఈనెల 6వరకు రెండు రోజులపాటు బెంగళూరులో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడే సూచన ఉందని బెంగళూరు వాతావరణ శాఖ తెలిపింది.

భారీ వర్షాలతో వైట్ ఫీల్డ్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఎక్కడికక్కడ రోడ్లపై వాహనాలు నిలిచిపోయాయి. 15 నిమిషాలు పట్టే ప్రయాణానికి గంటల సమయం పట్టిందని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలో నివసించే ఓ ప్రయాణికుడు తెలిపారు.

అయితే బెంగళూరు నగరంలో అధ్వాన్నమైన రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థపై నెటిజన్లు ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. చిన్న వర్షాలకే సిటీలో పలు ప్రాంతాల్లో రోడ్లపై మోకాళ్ల లోతు నీరు రావడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. సిటీలో నీట మునిగిన ప్రాంతాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తున్నారు. వీధులు జలమయమై నివాసాల్లోకి వర్షపు నీరు వచ్చిచేరుతుండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు సహాయం చేయాలని కోరుతున్నారు.

Updated Date - 2023-04-05T16:37:56+05:30 IST