Share News

Oath Taking: నేడు రాజస్థాన్ సీఎంగా భజన్‌లాల్ ప్రమాణ స్వీకారం.. హాజరుకానున్న బీజేపీ అగ్రనేతలు

ABN , Publish Date - Dec 15 , 2023 | 08:44 AM

రాజస్థాన్ బీజేపీ ముఖ్యమంత్రిగా(Rajasthan CM) భజన్ లాల్(Bajanlal) నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నవంబర్ 25న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 115 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్‌ 69 సీట్లు సాధించింది.

Oath Taking: నేడు రాజస్థాన్ సీఎంగా భజన్‌లాల్ ప్రమాణ స్వీకారం.. హాజరుకానున్న బీజేపీ అగ్రనేతలు

జైపుర్: రాజస్థాన్ బీజేపీ ముఖ్యమంత్రిగా(Rajasthan CM) భజన్ లాల్(Bajanlal) నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నవంబర్ 25న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 115 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్‌ 69 సీట్లు సాధించింది. అనేక తర్జనభర్జనలనంతరం బీజేపీ నాయకత్వం తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తికి సీఎం సీటును కట్టబెట్టింది.

ఇవాళ జరగనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలు రాష్ట్రాల నుంచి బీజేపీ(BJP) అగ్రనేతలు తరలిరానున్నారు.


చరిత్రాత్మక ఆల్బర్ట్ హాల్ వద్ద ఈవెంట్ జరగనుండగా అక్కడ.. భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర నేతలు, రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు పంపినట్లు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికార ప్రతినిధి తెలిపారు.

రాజధానికి వెళ్లే ప్రధాన రహదారులను కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల పోస్టర్లు, బ్యానర్లతో పాటు నాయకుల కటౌట్లతో అలంకరించారు. సీఎంగా భజన్ లాల్, డిప్యూటీ సీఎంలుగా దియా కుమారి, ప్రేమ్ చంద్ బైర్వాలతో గవర్నర్ కల్ రాజ్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

Updated Date - Dec 15 , 2023 | 08:48 AM