Rajasthan CM: రాజస్థాన్ కొత్త సీఎంగా భజన్‌లాల్ శర్మ
ABN , First Publish Date - 2023-12-12T16:49:02+05:30 IST
రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎవరనే సస్పెన్ష్‌కి బీజేపీకి తొమ్మిదిరోజుల తర్వాత తెరదించింది. కొత్త సీఎంగా భజన్‌లాల్ శర్మ పేరును ప్రకటించింది. పార్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర పరిశీలకులు రాజ్‌నాథ్ సింగ్, సరోజ్ పాండే, వినోద్ తవాడే సమక్షంలో జరిగిన సీఎల్‌పీ సమావేశానంతరం ఏకగ్రీవంగా భజన్‌లాల్ పేరును ప్రకటించారు.
జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రి (Rajasthan CM) ఎవరనే సస్పెన్ష్‌కి బీజేపీకి తొమ్మిదిరోజుల తర్వాత తెరదించింది. కొత్త సీఎంగా భజన్‌లాల్ శర్మ (Bhajanlal Sharma) పేరును ప్రకటించింది. పార్టీ ప్రధాన కార్యాలయంలో కేంద్ర పరిశీలకులు రాజ్‌నాథ్ సింగ్, సరోజ్ పాండే, వినోద్ తవాడే సమక్షంలో జరిగిన సీఎల్‌పీ సమావేశానంతరం ఏకగ్రీవంగా భజన్‌లాల్ పేరును ప్రకటించారు. సంగనేర్ నియోజకవర్గం నుంచి భజన్‌లాల్ శర్మ తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 56 ఏళ్ల శర్మ ఏబీవీపీలో తొలుత పనిచేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా మూడుసార్లు పనిచేసి బీజేపీకి సుదీర్ఘ కాలంగా సేవలందిస్తూ వస్తున్నారు.
ముఖ్యమంత్రి పదవికి మాజీ సీఎం వసుధరా రాజే, అర్జున్ రామ్ మేఘ్వాల్, గజేంద్ర సింగ్ షెకావత్, అశ్విని వైష్ణవ్, కైలాష్ చౌదరి, దియా కుమారి, అనిత్ భదేల్ పేర్లు ప్రముఖంగా వినిపించినప్పటికీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ భజన్‌లాల్ శర్మ పేరును ఖరారు చేశారు. ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 199 స్థానాలకు 115 స్థానాలను బీజేపీ గెలుచుకుంది.