Share News

Bihar Caste Survey: సామాజిక, ఆర్థిక గణాంకాల విడుదల.. ఎవరి స్టాటస్ ఎలా ఉందంటే..?

ABN , First Publish Date - 2023-11-07T14:55:18+05:30 IST

రాష్ట్రంలో ఇటీవల జరిగిన కులగణన ఆధారంగా ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితిపై డాటాను బీహార్ ప్రభుత్వం మంగళవారంనాడు విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన డాటా ప్రకారం, బీహార్‌లో జనరల్ కేటగిరిలో ఉన్న అగ్రవర్ణాలకు చెందిన భూమిహార్ల లో పేదరికం ఎక్కువగా ఉందని తేలింది.

Bihar Caste Survey: సామాజిక, ఆర్థిక గణాంకాల విడుదల.. ఎవరి స్టాటస్ ఎలా ఉందంటే..?

పాట్నా: రాష్ట్రంలో ఇటీవల జరిగిన కులగణన (Caste survey) ఆధారంగా ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితి (Social and economic status)పై డాటాను బీహార్ ప్రభుత్వం మంగళవారంనాడు విడుదల చేసింది. రాష్ట్ర అసెంబ్లీకి కూడా ఈ డాటాను సమర్పించింది. ప్రభుత్వం విడుదల చేసిన డాటా ప్రకారం, బీహార్‌లో జనరల్ కేటగిరిలో ఉన్న అగ్రవర్ణాలకు చెందిన భూమిహార్ల (Bhumihars)లో పేదరికం ఎక్కువగా ఉందని తేలింది. 27.58 శాతం భూమిహార్‌లు ఆర్థికంగా బలహీనంగా ఉన్నారు.


పేదరికంలో భూమిహార్ల తర్వాత స్థానంలో బ్రాహ్మణులు

భూమిహార్ సామాజికవర్గంలో 8,38,447 కుటుంబాలు ఉండగా, వీరిలో 2,31,211 మంది ఆర్థికంగా బలహీనంగా ఉన్న క్యాటగిరిలో ఉన్నారు. హిందూ అగ్రవర్ణాల్లో పేదరికం పరంగా బ్రాహ్మణ సామాజిక వర్గం రెండో స్థానంలో ఉంది. డాటా ప్రకారం 25.52 శాతం బ్రాహ్మణ కుటుంబాలు పేదరికంలో ఉన్నాయి. బీహార్‌లో 10,76,563 బ్రాహ్మణ కుటుంబాలు ఉండగా, వీరిలో 2,72,576 మంది పేదరికంలో ఉన్నారు. కాగా, పేదరికంలో రాజ్‌పుట్‌లు మూడో స్థానంలో ఉన్నారు. కులగణన నివేదిక ప్రకారం 24.89 శాతం రాజ్‌పుట్‌లు పేదరికంలో ఉన్నారు. రాష్ట్రంలో 9,53,447 రాజ్‌పుట్ కుటుంబాలు ఉండగా, వారిలో 2,37,412 కుటుంబాలు పేదరికంలో మగ్గుతున్నాయి.


సంపన్న కులంలో కాయస్థులు

ఇదే సమయంలో, కాయస్థులు (Kayasthas) అత్యంత సంపన్న సామాజికవర్గానికి చెందిన వారుగా నిలిచారు. రాష్ట్రంలో కేవలం 13.38 శాతం కాయస్థులు మాత్రమే పేదరికంలో ఉన్నారు. బీహార్‌లో ఈ సమాజాకి వర్గానికి చెందిన వారు 1,70,985 కుటుంబాలు ఉండగా, వీరిలో 23,639 కుటుంబాలు పేదరికంలో ఉన్నాయి.


ముస్లింల డాటా..

ముస్లింలలోని షేక్, పఠాన్, సైయద్‌‌ల ఫైనాన్సియల్ అకౌంట్స్‌ను కూడా ప్రభుత్వం విడుదల చేసింది. వీరిని అప్పర్ కాస్ట్‌గా పరిగణించారు. ప్రభుత్వ డాటా ప్రకారం షేక్ సామాజిక వర్గానికి చెందిన వారిలో 25.84 శాతం మంది పేదవారి కేటగిరిలో ఉన్నారు. షేక్ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు 10,38,880 కుటుంబాలు ఉండగా, వీరిలో 2,68,398 కుటుంబాలకు పేదరికంలో ఉన్నాయి. ఇదే సమయంలో పఠాన్ సామాజిక వర్గంలో 22.20 శాతం కుటుంబాలు పేదరికంతో బాధపడుతున్నారు. 17.61 శాతం సైయద్ కుటుంబాలు కూడా పేదరికంలో ఉన్నాయి.

Updated Date - 2023-11-07T14:55:51+05:30 IST