Biporjoy Cyclone : తీరం దాటిన తర్వాత తీవ్ర తుఫాన్‌గా బలహీనపడిన బిపర్‌జోయ్..
ABN , First Publish Date - 2023-06-16T09:47:22+05:30 IST
గుజరాత్ కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో బిపర్‌జోయ్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. తీరం దాటిన తర్వాత అతి తీవ్రం నుంచి తీవ్ర తుఫాన్‌గా బలహీనపడింది. గుజరాత్ దాటి రాజస్థాన్ దిశగా కదులుతోంది. ఈ కారణంగా నేడు, రేపు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. తుఫాన్ గాలులతో గుజరాత్‌లో ఎక్కడికక్కడ చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. 940 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
Delhi : గుజరాత్ కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో బిపర్‌జోయ్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. తీరం దాటిన తర్వాత అతి తీవ్రం నుంచి తీవ్ర తుఫాన్‌గా బలహీనపడింది. గుజరాత్ దాటి రాజస్థాన్ దిశగా కదులుతోంది. ఈ కారణంగా నేడు, రేపు గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. తుఫాన్ గాలులతో గుజరాత్‌లో ఎక్కడికక్కడ చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. 940 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నదులు, కాలువలు, నీట మునిగాయి. భావ్‌నగర్ జిల్లాలో తమ మేకలను కాపాడే యత్నంలో తండ్రీకొడుకులు ప్రాణాలు కోల్పోయారు. సహాయచర్యల్లో 18 ఎన్డీఆర్ఎఫ్, 12 ఎస్డీఆర్ఎఫ్, 115 రోడ్లు భవనాల శాఖ బృందాలు, 397 విద్యుత్ శాఖ బృందాలు పాల్గొంటున్నాయి. యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. జామ్‌నగర్ ఎయిర్‌పోర్టులో విమానయాన సేవలను నిలిపివేశారు. పదుల సంఖ్యలో రైలు సర్వీసులను రైల్వే శాఖ రద్దు చేసింది.