Poll Result: మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లో ముందంజలో బీజేపీ..ఛత్తీస్‌ఘడ్‌లో కాంగ్రెస్ దూకుడు
ABN , First Publish Date - 2023-12-03T09:25:00+05:30 IST
మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాల్లో ముందంజలో బీజేపీ..ఛత్తీస్‌ఘడ్‌లో దూసుకుపోతున్న కాంగ్రెస్
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరాదిన మూడు రాష్ట్రాల్లో మొదలైన ఓట్ల కౌంటింగ్‌లో ప్రస్తుతం బీజేపీ ముందంజలో ఉంది. పోస్టల్ బ్యాలెట్లు, తొలి రౌండ్ సరళి ప్రకారం మధ్యప్రదేశ్‌లో బీజేపీ125 స్థానాల్లో, కాంగ్రెస్ 89 స్థానాల్లో ముందున్నాయి. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలున్న విషయం తెలిసిందే. 199 సీట్లున్న రాజస్థాన్‌లో కాషాయం పార్టీ 84 స్థానాల్లో లీడ్‌లో ఉండగా కాంగ్రెస్ 76 స్థానాల్లో దూసుకుపోతుంది. అయితే, ప్రస్తుతం రెండు పార్టీల మధ్య స్వల్ప తేడా ఉండటంతో సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. మరోవైపు, ఛత్తీస్‌ఘఢ్‌లో పరిశీలకుల అంచనాలకు తగ్గట్టే కాంగ్రెస్ ఏకంగా 52 స్థానాల్లో ముందుంటే బీజేపీ 33 స్థానాల్లో ప్రత్యర్థి పార్టీకంటే ముందంజలో ఉంది.
మధ్యప్రదేశ్‌లో విజయం తమదేనన్న నమ్మకం ఉందని కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ అన్నారు. ఓట్ల కౌంటింగ్ మొదలైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అయితే, తాను ఇంకా ఓటింగ్ సరళిని చూడలేదని, ఉదయం 11.00 వరకూ ఏ ట్రెండ్‌ను విశ్లేషించాల్సిన అవసరమే లేదని ఆయన స్పష్టం చేశారు.