BJP MLC: రాజీనామాతో కలకలం రేపిన బీజేపీ ఎమ్మెల్సీ

ABN , First Publish Date - 2023-03-20T23:02:22+05:30 IST

ఎన్నికల వేళ బీజేపీ ఎమ్మెల్సీ రాజీనామా చేశారు.

BJP MLC: రాజీనామాతో కలకలం రేపిన బీజేపీ ఎమ్మెల్సీ
BJP MLC Baburao Chinchansur

బెంగళూరు: కర్ణాటక(Karnataka)లో అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ ఎమ్మెల్సీ బాబూరావ్ చించాసుర్(BJP MLC Baburao Chinchansur) రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను శాసన మండలి చైర్మెన్ బసవరాజ్ హొరట్టికి సమర్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. అయితే ఆయన ఎమ్మెల్సీగా ఉన్నందున ఎమ్మెల్యే(MLA) అభ్యర్ధిగా పోటీచేసేందుకు బీజేపీ నిరాకరించింది. దీంతో ఆయన రాజీనామా చేశారు. అయితే ఆయన రాజీనామాను శాసన మండలి చైర్మెన్ బసవరాజ్ హొరట్టి ఆమోదిస్తారా లేదా అనేది తేలాల్సి ఉంది.

కర్ణాటకలో మరో 3 నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈసీ నోటిఫికేషన్ రావాల్సి ఉంది. కర్ణాటకలో ప్రస్తుతం బస్వరాజ్ బొమ్మై సారధ్యంలో బీజేపీ అధికారంలో ఉంది. గెలిచి మరోసారి అధికారం చేపట్టాలని కమలనాథులు యత్నాలు చేస్తుండగా ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్ల రూపంలోకి మార్చుకోవాలని ప్రతిపక్షాలు యత్నిస్తున్నాయి. జేడీఎస్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి దూకుడుగా ప్రచారం చేస్తోంది. చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కూడా బలంగా ఉంది.

Updated Date - 2023-03-20T23:02:27+05:30 IST