Karnataka Assembly Elections: ముఖ్యమంత్రికి మాటిచ్చి నిలబెట్టుకున్న కిచ్చా సుదీప్

ABN , First Publish Date - 2023-04-19T20:26:17+05:30 IST

సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ లాంటి వాళ్లు తప్పుబట్టినా బొమ్మైకి కిచ్చా సుదీప్ అండగా నిలిచారు.

Karnataka Assembly Elections: ముఖ్యమంత్రికి మాటిచ్చి నిలబెట్టుకున్న కిచ్చా సుదీప్
CM Basavaraj Bommai JP Nadda Kannada actor Kichcha Sudeep

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల (Karnataka Assembly Elections) వేళ ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై (CM Basavaraj Bommai) నామినేషన్ వేశారు. శిగ్గావ్ అసెంబ్లీ నియోజకవర్గం(Shiggaon assembly constituency) నుంచి ఆయన తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా( BJP national president JP Nadda), కన్నడ సినీ నటుడు కిచ్చా సుదీప్ (Kannada actor Kichcha Sudeep) పాల్గొన్నారు. అంతకు ముందు నిర్వహించిన రోడ్‌షోలోనూ వీరిద్దరూ పాల్గొన్నారు. బొమ్మైకి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తానని కిచ్చా సుదీప్ గతంలోనే ప్రకటించారు. సుదీప్‌ను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తాను బీజేపీలో చేరకున్నా బొమ్మైకి, ఆయన సూచించే అభ్యర్థులకు ప్రచారం చేస్తానని సుదీప్ ప్రకటించారు. సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ లాంటి వాళ్లు తప్పుబట్టినా బొమ్మైకి కిచ్చా సుదీప్ అండగా నిలిచారు. ప్రచారం సాగిస్తున్నారు.

మరోవైపు బొమ్మైకి మద్దతుగా ప్రచారం చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ విభజించడమే ధ్యేయంగా దేశాన్ని పాలించిందని ఎద్దేవా చేశారు. ఉత్తరం, దక్షిణం, భాషలు, ప్రాంతాలు, కులాలు, మతాలు ఇలా ప్రతి అంశంలోనూ విభజనే ధ్యేయంగా కాంగ్రెస్ పాలన సాగిందని విమర్శించారు. అయితే బీజేపీ మాత్రం భిన్నత్వంలో ఏకత్వం చూస్తుందన్నారు. ప్రాంతీయ సెంటిమెట్లను గౌరవిస్తూనే బీజేపీ జాతీయ దృక్పథాన్ని కలిగి ఉంటుందని నడ్డా చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అంటే కమీషన్, కరప్షన్, క్రిమినలైజేషన్ అని నడ్డా ఎద్దేవా చేశారు. కర్ణాటకలో మరోసారి అధికారంలోకి వస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి బొమ్మై మాట్లాడుతూ తాము చేసిన అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తనకు మద్దతుగా ప్రచారం చేసిన నడ్డాకు, కిచ్చా సుదీప్‌కు ధన్యవాదాలు తెలిపారు. త్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా స్టార్ క్యాంపెయినర్లందరూ కర్ణాటకలో ప్రచారం చేస్తారని బొమ్మై చెప్పారు.

కర్ణాటక (Karnataka)లో మే 10న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓట్ల లెక్కింపు మే 13న జరుగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.

Updated Date - 2023-04-21T21:25:03+05:30 IST