Uttar pradesh: బుల్డోజర్‌తో మాఫియా నేత నివాసం నేలమట్టం
ABN , First Publish Date - 2023-06-17T14:40:34+05:30 IST
మాఫియాపై ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ మళ్లీ కొరడా ఝళిపించింది. మాపియా నేత వినోద్ ఉపాధ్యాయ్ నివాసం వద్ద గోరఖ్‌పూర్ జిల్లా త్రాంగం శనివారంనాడు ఆక్రమణల కూల్చివేత డ్రైవ్ చేపట్టింది. మాఫియా వినోద్ ప్రస్తుతం పరారీలో ఉండగా, ఆయనపై ప్రభుత్వం రూ.50,000 బహుమతి కూడా ప్రకటించింది.
లక్నో: మాఫియాపై ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) సర్కార్ మళ్లీ కొరడా ఝళిపించింది. మాపియా నేత వినోద్ ఉపాధ్యాయ్ (Mafia Vinod Upadhyay) నివాసం వద్ద గోరఖ్‌పూర్ జిల్లా యంత్రాంగం శనివారంనాడు ఆక్రమణల కూల్చివేత డ్రైవ్ చేపట్టింది. మాఫియా వినోద్ ప్రస్తుతం పరారీలో ఉండగా, ఆయనపై ప్రభుత్వం రూ.50,000 బహుమతి కూడా ప్రకటించింది.
వినోద్ నేరచరిత్రపై సిటీ ఎస్పీ క్రిష్ణన్ బిష్ణోయ్ మీడియాతో మాట్లాడుతూ, వినోద్ ఉపాధ్యాయ్‌పై నాలుగు హత్య కేసులతో సహా 32 కేసులు నమోదై ఉన్నాయని, ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడని చెప్పారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించడంతో పాటు తన నివాసానికి ఆనుకున్న ప్లాట్‌ను కూడా అతను ఆక్రమించుకున్నాడని తెలిపారు. కోట్లాది రూపాయలతో బిల్డింగ్ కట్టాడని, ఆక్రమిత ప్రభుత్వ భూమిని గోరఖ్‌పూర్ డవలప్‌మెంట్ అథారిటీ గుర్తించి కూల్చివేతలు చేపట్టిందని చెప్పారు. ఉపాధ్యాయ్ కోసం గాలింపు చర్యలు జరుపతున్నాయని, అతని అరెస్టు కోసం ప్రకటించిన రివార్డును కూడా పెంచనున్నామని తెలిపారు. జిల్లా యంత్రాంగం చేపట్టిన ఆక్రమణల కూల్చివేతల్లో భాగంగా మాఫియా వినోద్ ఉపాధ్యాయ నివాసాన్ని సిబ్బంది సుత్తులతో పగులగొట్టారు. ప్రహరీగోడలను బుల్డోజర్‌తో నేలమట్టం చేశారు.