Khalistan : ఖలిస్థానీల చర్యలపై భారత్‌ను తప్పుబట్టిన కెనడా పీఎం ట్రుడు

ABN , First Publish Date - 2023-07-06T16:02:51+05:30 IST

భారత దేశానికి వ్యతిరేకంగా ఖలిస్థానీ ఉగ్రవాదం కెనడాలో పెరుగుతోంది. దీనిపై చర్యలు తీసుకోవాలని కెనడాను భారత ప్రభుత్వం కోరుతున్నప్పటికీ, ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల ఆ దేశం సరైన రీతిలో స్పందించడం లేదు. ఆ దేశ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రుడు (Justin Trudeau) ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవడానికి బదులుగా భారత్‌నే తప్పుబడుతున్నారు.

Khalistan : ఖలిస్థానీల చర్యలపై భారత్‌ను తప్పుబట్టిన కెనడా పీఎం ట్రుడు
Canadian PM Trudeau

ఒట్టావా (కెనడా) : భారత దేశానికి వ్యతిరేకంగా ఖలిస్థానీ ఉగ్రవాదం కెనడాలో పెరుగుతోంది. దీనిపై చర్యలు తీసుకోవాలని కెనడాను భారత ప్రభుత్వం కోరుతున్నప్పటికీ, ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల ఆ దేశం సరైన రీతిలో స్పందించడం లేదు. ఆ దేశ ప్రధాన మంత్రి జస్టిన్ ట్రుడు (Justin Trudeau) ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవడానికి బదులుగా భారత్‌నే తప్పుబడుతున్నారు. తన దేశంలోని ఖలిస్థానీ వేర్పాటువాదులకు మద్దతిస్తున్నట్లుగా ఆయన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయి.

మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ (Indira Gandhi) హత్యను ప్రదర్శిస్తూ ఓ శకటాన్ని ఇటీవల కెనడాలో ఖలిస్థాన్ వేర్పాటువాద సంస్థలు ప్రదర్శించాయి. దీనిపై భారత దేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సిక్కు రాడికల్స్‌పై చర్యలు తీసుకోవాలని కోరింది.

కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రుడు గురువారం స్థానిక విలేకరితో మాట్లాడారు. ఖలిస్థాన్ అనుకూలవాదులు ఓటు బ్యాంకులో ఎక్కువగా ఉండటం వల్ల ఇటువంటి తీవ్రవాదం పట్ల మెతకగా వ్యవహరిస్తున్నారా? అని ఆ విలేకరి ప్రశ్నించినపుడు ట్రుడు మాట్లాడుతూ, ఆ విధంగా భావించేవారిది పూర్తిగా తప్పుడు ఆలోచన అని చెప్పారు. ఉగ్రవాదం, హింస పట్ల కెనడా కట్టుదిట్టంగా వ్యవహరిస్తుందన్నారు. హింస, హింసకు సంబంధించిన ముప్పులపై కెనడా ఎల్లప్పుడూ కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తాము ఎల్లప్పుడూ తీవ్రమైన చర్యలు తీసుకున్నామని, ఇకపై కూడా అలాగే చేస్తామని చెప్పారు. విభిన్న సంస్కృతులవారికి తమ దేశం స్వాగతం పలుకుతోందన్నారు. తాము వాక్ స్వాతంత్ర్యాన్ని బలపరుస్తామని చెప్పారు. తమది చాలా వైవిద్ధ్యభరితమైన దేశమని చెప్పారు. హింస, తీవ్రవాదాలు ఏ రూపంలో ఉన్నా వాటికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటామన్నారు.

ఖలిస్థానీ ఉగ్ర దాడులపై కెనడా మౌనం

కెనడాలోని భారతీయ మూలాలుగలవారికి వ్యతిరేకంగా ఖలిస్థాన్ అనుకూల సంస్థలు పోస్టర్లతో దుష్ప్రచారం చేస్తున్నాయి. దీంతో భారతీయ మూలాలుగలవారిలో భయాందోళన, అశాంతి పెరుగుతున్నాయి. ఖలిస్థానీ ఉగ్రవాదుల వల్ల ఎదురవుతున్న ముప్పు గురించి భారత ప్రభుత్వం హెచ్చరిస్తున్నప్పటికీ, ఖలిస్థానీలు పాల్పడుతున్న హింసాకాండ గురించి కెనడా నేతలు నోరు మెదపడం లేదు. మరోవైపు సిక్కు వేర్పాటువాదులు రాడికలైజ్ అవడం పెరుగుతోందని కెనడియన్ సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ సర్వీస్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అయితే కెనడాలోని భారతీయ దౌత్యవేత్తలకు రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు భద్రత కల్పించారు.

కెనడాలోని భారతీయ దౌత్యవేత్తల పేర్లు, ఫొటోలను ప్రదర్శిస్తూ ఖలిస్థానీ ఉగ్రవాదులు బహిరంగంగా దాడులకు పాల్పడుతున్నారు. దీనిపై కెనడా విదేశాంగ మంత్రి, రక్షణ మంత్రి నామమాత్రంగా మాత్రమే స్టేట్‌మెంట్లు ఇచ్చారు. కానీ ప్రతిపక్ష కన్జర్వేటివ్ లీడర్ లేదా ప్రధాన మంత్రి ఈ దాడులను ఖండించలేదు. భారతీయ మూలాలుగలవారు కెనడాలో దాదాపు 24 లక్షల మంది ఉన్నారు. అయితే ఏడు లక్షల మంది ఉన్న సిక్కులు ఓటు బ్యాంకుగా మారారు. గ్రేటర్ టొరంటో, గ్రేటర్ వాంకోవర్, ఎడ్మంటన్, కల్గరీలలో వీరి ఓట్లకు చాలా ప్రాధాన్యం ఉంది. భారతీయ మూలాలుగలవారు ఐకమత్యంగా లేకుండా, విడిపోయారు. మితవాద సిక్కులు అతివాద సిక్కుల గురించి కనీసం ఒక మాట అయినా మాట్లాడరు. భారతీయ మూలాలుగలవారు కూడా ఏమీ మాట్లాడరు.

ఇవి కూడా చదవండి

Canada : ‘ఖలిస్థాన్’పై కెనడా నేతలు మౌనం.. భారత దౌత్యవేత్తలకు భద్రత ఏర్పాట్లు..

Kapil Sibal : ఇది ప్రజాస్వామ్యం కాదు : కపిల్ సిబల్

Updated Date - 2023-07-06T16:03:09+05:30 IST