Gali Janardhan Reddy: గాలి జనార్ధన్ రెడ్డికి పెద్ద దెబ్బే ఇది..!
ABN , First Publish Date - 2023-06-14T05:22:43+05:30 IST
గనుల అక్రమాల కేసుల్లో మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డితో పాటు ఆయన భార్య లక్ష్మీఅరుణకు చెందిన 77 ఆస్తులను జప్తు చేయాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం
బెంగళూరు, జూన్ 13(ఆంధ్రజ్యోతి): గనుల అక్రమాల కేసుల్లో మాజీ మంత్రి గాలి జనార్దనరెడ్డితో పాటు ఆయన భార్య లక్ష్మీఅరుణకు చెందిన 77 ఆస్తులను జప్తు చేయాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మంగళవారం ఆదేశించింది. ఆయనపై నమోదైన క్రిమినల్ కేసులు తేలేదాకా ఆస్తులు జప్తులోనే ఉంటాయని కోర్టు పేర్కొంది. జనార్దనరెడ్డి దంపతులకు సంబంధించిన 124 ఆస్తుల జప్తును కోరుతూ సీబీఐ అధికారులు కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం, అవినీతి వ్యతిరేకచట్టం, క్రిమినల్ కేసుల సవరణ చట్టానికి అనుగుణంగా వారికి చెందిన 77 ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించింది. దక్షిణ కన్నడ జిల్లా ధర్మస్థల ఆలయ సందర్శనకు కుటుంబీకులతో వెళ్లిన జనార్దనరెడ్డి, సీబీఐ కోర్టు ఆదేశాలపై స్పందించారు. దేవుడి ఆశీస్సులతో బయటపడతానన్నారు. కాగా, గనుల ఆక్రమాల కేసులో జైలు పాలై బయటకు వచ్చాక గాలి బెంగళూరుకే పరిమితమయ్యారు. ఇటీవలే కళ్యాణ రాజ్య ప్రగతిపక్ష పేరిట రాజకీయ పార్టీని స్థాపించి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.