Central Govt: ఆ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు..
ABN , First Publish Date - 2023-07-20T08:08:14+05:30 IST
ఆన్‌లైన్ క్రీడలను నిషేధిస్తూ చట్టం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని మద్రాసు హైకోర్టు(Madras High Court)కు కేంద్ర ప్రభుత్వం(Cen
పెరంబూర్(చెన్నై): ఆన్‌లైన్ క్రీడలను నిషేధిస్తూ చట్టం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని మద్రాసు హైకోర్టు(Madras High Court)కు కేంద్ర ప్రభుత్వం(Central Govt) స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్‌లైన్ క్రీడల నిషేధ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఆన్‌లైన్ క్రీడా సంస్థలు మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ కేసుపై బుధవారం మరోమారు విచారణ జరగ్గా.. కేంద్రప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఆన్‌లైన్ క్రీడలను నిషేధిస్తూ చట్టం చేసే అధికారి రాష్ట్ర ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు. ఆన్‌లైన్ క్రీడలు క్రమబద్ధీకరించేలా కేంద్ర ప్రభుత్వం(Central Govt) ఇప్పటికే చట్టం తీసుకొచ్చిందని వివరించారు. ఆ చట్టం ప్రకారం ఆన్‌లైన్ క్రీడలో జూదాన్ని అడ్డుకోవచ్చని పేర్కొన్నారు. కాగా ఈ వ్యవహారంలో మరిన్ని వివరాలు తమ ముందుంచాలని ఇరువర్గాలను ఆదేశిస్తూ హైకోర్టు తదుపరి విచారణను ఆగస్టు 1వ తేదీకి వాయిదావేసింది.