Parliament : ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు.. ప్రత్యేక పార్లమెంటు సమావేశాల రహస్యం అదే..?
ABN , First Publish Date - 2023-08-31T18:27:10+05:30 IST
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంస్కరణల జాబితాలో ఎన్నికలు కూడా చేరుతున్నాయి. ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ జరగాలని ఆయన చాలా రోజుల నుంచి చెప్తున్నారు. దీని కోసమే సెప్టెంబరులో ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంస్కరణల జాబితాలో ఎన్నికలు కూడా చేరుతున్నాయి. ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ జరగాలని ఆయన చాలా రోజుల నుంచి చెప్తున్నారు. దీని కోసమే సెప్టెంబరులో ప్రత్యేక పార్లమెంటు సమావేశాలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా ఈ వివరాలను తెలిపింది.
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ గురువారం ఇచ్చిన ట్వీట్‌లో, పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు సెప్టెంబరు 18 నుంచి 22 వరకు జరుగుతాయని తెలిపారు. 17వ లోక్ సభలో 13వ సెషన్, రాజ్య సభ 261వ సెషన్ జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశాల్లో ఐదు సిట్టింగ్స్ ఉంటాయన్నారు. అమృత కాలంలో పార్లమెంటులో సత్ఫలితాలిచ్చే చర్చల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.
ఈ నేపథ్యంలో విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, ఈ ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ నిర్వహించేందుకు బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వివిధ రాష్ట్రాల శాసన సభ ఎన్నికలతోపాటు లోక్ సభ ఎన్నికలను నిర్వహించడమే దీని ఉద్దేశం. దీని గురించి గతంలో చాలాసార్లు ప్రస్తావించారు. శాసన పరిశీలన సంఘం (Law Commission of India) కూడా దీనిని అధ్యయనం చేసింది.
ప్రస్తుతం లోక్ సభ, శాసన సభల పదవీ కాలాలు ముగిసిన వెంటనే ఎన్నికలను నిర్వహిస్తున్నారు. దీనివల్ల ఒకే సంవత్సరంలో రెండుసార్లు (లోక్ సభకు ఒకసారి, శాసన సభకు మరోసారి) ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రెండిటికీ ఒకేసారి ఎన్నికలను నిర్వహిస్తే, ఒక రోజే ఓటర్లు రెండిటికీ ఓటు వేస్తారు.
ఇవి కూడా చదవండి :
Adani Group : తాజా ఆరోపణలను కొట్టిపారేసిన అదానీ గ్రూప్.. అవన్నీ పాత పాటలేనన్న పారిశ్రామిక దిగ్గజం..
Parliament : కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం