Mumbai: లోకల్ ట్రైన్ ముందు దూకి లోకో పైలెట్ ఆత్మహత్య

ABN , First Publish Date - 2023-02-01T06:54:28+05:30 IST

రైల్వే చీఫ్ లోకో పైలెట్ రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన....

Mumbai: లోకల్ ట్రైన్ ముందు దూకి లోకో పైలెట్ ఆత్మహత్య
Loco Pilot Jumps Local Train

ముంబయి: రైల్వే చీఫ్ లోకో పైలెట్ రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహారాష్ట్రలోని ముంబయి నగరంలో వెలుగుచూసింది.(Chief Loco Pilot) ముంబైలోని విలే పార్లే స్టేషన్‌లో(Mumbai Local Train) పశ్చిమ రైల్వేకు చెందిన 57 ఏళ్ల చీఫ్ లోకో పైలెట్ రాకేష్‌కుమార్‌గౌడ్‌ సమీపిస్తున్న లోకల్ రైలు ముందు రైల్వే ట్రాక్‌పై దూకి(Jumps) ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రభుత్వ రైల్వే పోలీసు అధికారి తెలిపారు.(Dies)రైల్వే స్టేషనులో రైలు ముందు దూకిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన విలేపార్లే రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమైందని పోలీసులు చెప్పారు.సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయిన ప్రమాద వీడియోను పోలీసులు సేకరించారు.

మృతుడు రాకేష్‌కుమార్‌గౌడ్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.లోకో పైలెట్ ఆత్మహత్యకు కారణాలు తెలియలేదు. రాకేష్‌కుమార్‌గౌడ్‌ ఆత్మహత్య చేసుకోవడంపై రైల్వే పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.చీఫ్ లోకో పైలెట్ గౌడ్ ఎప్పుడూ పనిఒత్తిడి గురించి ఫిర్యాదు చేయలేదని అతని కుటుంబ సభ్యులు చెప్పారు.ప్రమాదవశాత్తు మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-02-01T06:54:28+05:30 IST