Chief Minister: సీఎం బసవరాజ్ సంచలన వ్యాఖ్యలు.. ఆయన ఏమన్నారో తెలిస్తే..
ABN , First Publish Date - 2023-03-26T08:12:16+05:30 IST
చట్టం ముందు అందరూ సమానమేనని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఇందుకు అతీతులు ఏమీ కాదని ముఖ్యమంత్రి బసవరాజ్ బొ
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): చట్టం ముందు అందరూ సమానమేనని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఇందుకు అతీతులు ఏమీ కాదని ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై(Chief Minister Basavaraj Bommai) పేర్కొన్నారు. బెంగళూరు హెచ్ఏఎల్ విమానాశ్రయంలో శనివారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్రమోదీకి గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌తో కలసి పుష్పగుచ్ఛాలు అందచేసి స్వాగతం పలికారు. అనంతరం సీఎం మాట్లాడుతూ దేశంలో అందరికీ చట్టం ఒక్కటేనన్నారు. రాహుల్‌గాంధీపై అనర్హత వేటు రాజ్యాంగబద్ధంగానే జరిగిందన్నారు. నోరుంది కదా అని ఎలా మాట్లాడినా చెల్లుబాటు అవుతుందనుకోవడం సరికాదని హితవు పలికారు. పశ్చాత్తాపం వ్యక్తం చేసి తన తప్పును దిద్దుకునే అవకాశాన్ని రాహుల్‌కు కోర్టు కల్పించినా ఆయన ఉపయోగించుకోలేదన్నారు. కాంగ్రెస్ తొలి జాబితా తనకు ఏమాత్రం ఆశ్చర్యం కలిగించలేదన్నారు.