Chief Minister: సీఎం సిద్దరామయ్య సంచలన కామెంట్స్.. ఆయన ఏమన్నారో తెలిస్తే...
ABN , First Publish Date - 2023-10-03T13:16:13+05:30 IST
సెక్యులర్ విధానాలతో రాజకీయలు సాగిద్దామని ప్రాణముండేదాకా బీజేపీతో వెళ్ళేది లేదన్న మాజీ ప్రధాని దేవేగౌడ ఇప్పుడు వారితో పొత్తుకు
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): సెక్యులర్ విధానాలతో రాజకీయలు సాగిద్దామని ప్రాణముండేదాకా బీజేపీతో వెళ్ళేది లేదన్న మాజీ ప్రధాని దేవేగౌడ ఇప్పుడు వారితో పొత్తుకు కుతూహలం చూపుతున్నారని సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) మండిపడ్డారు. బెంగళూరులో సీఎం సోమవారం మీడియాతో మాట్లాడుతూ సెక్యులర్ విధానాలు ఇప్పుడు ఏమైనట్లు అంటూ నిలదీశారు. 1999లో జనతా పార్టీ విభజన జరిగినప్పుడు కొందరు బీజేపీకు మద్దతిచ్చి ఎన్‌డీఏలో చేరారన్నారు. బీజేపీలో చేరకుండా వ్యతిరేకించిన వారంతా సెక్యులర్ విధానాలకు కట్టుబడ్డారన్నారు. అలా జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) ఏర్పడిందని, వ్యవస్థాపక సభ్యులలో ఒకడని తొలి అధ్యక్షుడు నేనే అన్నారు. రాజకీయ పార్టీలు మారినా సిద్ధాంతాలను వీడరాదన్నారు. జేడీఎస్ సెక్యులర్‌గా చెప్పుకుంటూ దశాబ్దాల కాలం రాజకీయాలు చేసి ప్రస్తుతం బీజేపీతో కలిసి మైత్రి ఏర్పాటును ప్రజలు ఏమని అర్థం చేసుకోవాలన్నారు.