Chief Minister: సీఎం సంచలన ప్రకటన.. నో డౌట్.. ఆ ఐదు గ్యారెంటీలు అమలు చేసే తీరుతాం..
ABN , First Publish Date - 2023-06-11T13:02:49+05:30 IST
ప్రజలకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఐదు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Sid
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): ప్రజలకు ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఐదు గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) ధీమా వ్యక్తం చేశారు. సిద్దరామయ్య సొంత నియోజకవర్గం వరుణలో శనివారం అభిమానులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. తొలుత మైసూరులో పార్టీ కీలక నేతలతో సమావేశమయ్యాక వరుణ నియోజకవర్గానికి వెళ్లారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఐదు గ్యారెంటీలను ప్రకటించగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) వీటి అమలు అసాధ్యమని పేర్కొన్నారని సీఎం గుర్తు చేశారు. బీజేపీ అవినీతి, దుర్మార్గపు పాలన, సమాజాన్ని చీల్చే ప్రక్రియ కొనసాగించిందని అందుకే తగిన గుణపాఠం చెప్పారన్నారు. ఇవి తన చివరి ఎన్నికలని ఇప్పటికే ప్రకటించిన విధంగా పాటిస్తానని తెలిపారు. కానీ తుదిశ్వాస వరకు క్రియాశీలక రాజకీయాల్లో ఉంటానని, ప్రజా సేవ కొనసాగిస్తానని చెప్పారు. 2013లో అధికారంలోకి వచ్చినప్పుడు కులమత వర్గ భేదాలు లేకుండా హామీలన్నింటినీ అమలు చేశామన్నారు. మరోసారి అదే ధోరణితో ముందుకు సాగుతామన్నారు. బసవణ్ణ(Basavanna) ఆశయాలకు కట్టుబడతామన్నారు. మంత్రులు మహదేవప్ప, వెంకటేశ్, ఎమ్మెల్యే పుట్టరంగశెట్టి, మాజీ ఎమ్మెల్యే యతీంద్ర సిద్దరామయ్య సహా జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పలువురు అభిమానులు రాకేశ్, సిద్దరామయ్య కలసి ఉండే ఫొటోను బహూకరించారు.