Chief Minister: కొత్త మద్యం దుకాణాలపై అసలు విషయం చెప్పేసిన సీఎం.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-10-07T13:09:27+05:30 IST

రాష్ట్రంలో కొత్తగా మద్యం దుకాణాలు తెరిచే ఆలోచన లేదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) స్పష్టం చేశారు.

Chief Minister: కొత్త మద్యం దుకాణాలపై అసలు విషయం చెప్పేసిన సీఎం.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా మద్యం దుకాణాలు తెరిచే ఆలోచన లేదని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) స్పష్టం చేశారు. చిత్రదుర్గ జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్తగా మద్యం దుకాణాలు తెరవాలనే ప్రతిపాదనను విరమించుకున్నామని అన్నారు. రాష్ట్రంలో అమలులో ఉన్న ఐదు గ్యారెంటీ పథకాలకు అభివృద్ధికి సంబంధం లేదన్నారు. గ్యారెంటీలతో అభివృద్ధి కుంటుపడిందనేది అవాస్తవమని పేర్కొన్నారు. బీజేపీ(BJP) నేతలు రాజకీయం కోసమే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలోనూ పాలన సాగించానని, బీజేపీ ప్రభుత్వం తరహాలో అప్పులు చేయలేదని తెలిపారు. తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే నైతికత వారికి లేదని అన్నారు. మూడున్నరేళ్ల బీజేపీ పాలనలో ఎం తమేర అప్పులు చేశారో తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. రాష్ట్రం లో కరువుతో రూ.30వేల కోట్ల పంటనష్టం జరిగిందన్నారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ మార్గదర్శకాలకు అనుగుణంగా రూ. 4,860 కోట్లు పరిహారాన్ని కోరామన్నారు. రాష్ట్రంలో 236 తాలూకాలకుగాను 195 తాలూకాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించామన్నారు.

ప్రాజెక్టుల్లో నీరు లేదని, కొన్ని చోట్ల తాగునీటికి ఇబ్బంది ఉందని తెలిపారు. ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కరించేలా జిల్లా అధికారులకు సూచించామన్నారు. కరువు బృం దాలు 11 జిల్లాల్లో పర్యటిస్తున్నాయన్నారు. కేంద్రానికి నివేదిక ఇచ్చాక పరిహారం అందుతుందని తెలిపారు. భద్ర ఎగువ ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ప్రకటించి రూ.5,300 కోట్లు విడుదల చేస్తామని బడ్జెట్‌లో పొందుపరిచిందని, కానీ ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదన్నారు. దీనిపై మరోసారి కేంద్రానికి లేఖ రాస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వనుందని చెప్పారు. శివమొగ్గ అల్లర్లకు కారకులైనవారిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉద్యానవన పరిశోధనా కేంద్రం శతమానోత్సవం, సిరిధాన్యాల మేళాను ఆయన ప్రారంభించారు. మంత్రులు బి. సుధాకర్‌, చలువరాయస్వామి, ఎమ్మెల్యేలు రఘుమూర్తి, చంద్రప్ప, కేసీ వీరేంద్రపప్పి, ఎన్‌వై గోపాలకృష్ణ, గోవిందప్ప, మాజీ ఎంపీ చంద్రప్ప, వ్యవసాయ నిపుణుడు ఏకాంతయ్య తదితరులు పాల్గొన్నారు. ఇదే సందర్భంగా కలుషిత నీరు తాగి మృతి చెందిన వారి కుటుంబీకులను పరామర్శించారు. ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.

pandu1.jpg

Updated Date - 2023-10-07T13:09:27+05:30 IST