CM: పునీత్‌ జ్ఞాపకార్థం రూ.6 కోట్లతో ఏఈడీ కేంద్రాలు

ABN , First Publish Date - 2023-07-08T13:09:10+05:30 IST

రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి సంపూర్ణ ఆరోగ్యానికి కట్టుబడ్డామని సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ సేవలను గ్రామీణ

CM: పునీత్‌ జ్ఞాపకార్థం రూ.6 కోట్లతో ఏఈడీ కేంద్రాలు

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రతి వ్యక్తికి సంపూర్ణ ఆరోగ్యానికి కట్టుబడ్డామని సీఎం సిద్దరామయ్య(CM Siddaramaiah) పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపచేస్తామన్నారు. కర్ణాటక రత్న డాక్టర్‌ పునీత్‌ రాజ్‌కుమార్‌(Karnataka Ratna Dr. Puneeth Rajkumar) జ్ఞాపకార్థం అకస్మిక గుండెపోటు మరణాలను నియంత్రించేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లా, తాలూకా కేంద్రాలలో ఆటోమేటెడ్‌ ఎక్స్‌టర్నల్‌ డెఫిబ్రిలిటర్స్‌ (ఏఈడీ)లను రూ.6కోట్లతో ఏర్పాటు చేస్తామన్నారు. రూ.92 కోట్లతో జిల్లా, తాలూకా కేంద్రాలలో డయాలసిస్‌ సెంటర్‌లను తెరుస్తామన్నారు. ప్రస్తుతం 173 నుంచి 218కు పెంచనున్నారు. 23 పీహెచ్‌సీలను కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌గా అప్‌గ్రేడ్‌కు రూ.70కోట్లను, నవజాత శిశువుల సంరక్షణకు రూ.25 కోట్లు, నిమ్హాన్స్‌ సహకారంతో బ్రెయిన్‌ హెల్త్‌ ఇన్షియేటివ్‌ను మూడు జిల్లాల్లో ప్రయోగాత్మకంగా రూ.25 కోట్లతో అమలు చేయనున్నారు. ఆశాకిరణ పేరిట కంటి శిబిరాల ఏర్పాటుకు 4 జిల్లాల్లో రూ.21కోట్లతో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. క్షయ నివారణ కోసం రూ.3కోట్లతో ప్రతి జిల్లాకు 2 ఎక్స్‌రే కేంద్రాలను ఏర్పాటు చేయడం, అన్ని జిల్లా ఆసుపత్రులలోనూ సిటీ స్కానింగ్‌, ఎంఆర్‌ఐలను అందుబాటులోకి తీసుకురావడం ఆరోగ్య సాంకేతికతకు ప్రాధాన్యతనిస్తూ రూ.2కోట్లు కేటాయించారు.

నిమ్హాన్స్‌లో సమగ్ర అవయవ అమరిక కేంద్రం

వైద్య విద్య విభాగానికి బడ్జెట్‌లో ప్రాధాన్యత కల్పించారు. నిమ్హాన్స్‌ ప్రాంగణంలో రూ.146 కోట్లతో దేశంలోనే ప్రథమంగా సమగ్ర అవయవ అమరిక కేంద్రం ఏర్పాటు కానుంది. వీటితోపాటు నాన్‌ అల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ జబ్బును, సిరోసిస్‌, కేన్సర్‌ను గుర్తించే ఫైబ్రోస్కాన్‌ను అమర్చనున్నారు. డీసీఎం డీకే శివకుమార్‌ సొంత నియో జకవర్గం కనకపురకు కొత్తగా మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారు. గదగ్‌, కొప్పళ, కార్వార, కొడగు జిల్లాల్లో 450 పడకల ఆసుపత్రుల నిర్మాణానికి రూ.450 కోట్లు కేటాయించారు. మైసూరు, కలబురగి, బెళగావిలలో సూపర్‌ స్పెషా లిటీ ఆసుపత్రులకు రూ.155 కోట్లు, కలబురగిలో మెడికల్‌ కళాశాలలో 200 పడక లతో మాతాశిశు ప్రత్యేక విభాగానికి రూ.70కోట్లు కేటాయించారు. మైసూరు, కల బురగిలలో ట్రామాకేర్‌ సెంటర్‌లకు రూ.30కోట్లు, కిద్వాయ్‌ సంస్థ కలబురగి, మై సూరులలో ప్రాంతీయ కేంద్రాల ఏర్పాటుకు రూ.20 కోట్లు కేటాయించారు. బెంగ ళూరు విక్టోరియా ఆసుపత్రిలో రూ.5కోట్లతో స్వతంత్ర రక్తనిధి నిర్వహణా కేంద్రం ఏర్పాటు చేయనున్నారు.

Updated Date - 2023-07-08T13:09:12+05:30 IST