CM Siddaramaiah: ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు కోపమొచ్చింది.. విషయమేంటో తెలిస్తే...
ABN , First Publish Date - 2023-09-22T12:01:57+05:30 IST
పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవంలో ఎంపీలకు పంపిణీ చేసిన రాజ్యాంగ పీఠిక ప్రతిలో లౌకికవాదం, సమాజవాదం అనే
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవంలో ఎంపీలకు పంపిణీ చేసిన రాజ్యాంగ పీఠిక ప్రతిలో లౌకికవాదం, సమాజవాదం అనే పదాలను తొలగించడంపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) విరుచుకుపడ్డారు. ఈ మేరకు గురువారం ఆయన ట్వీట్ చేస్తూ రాజ్యాంగంపై బీజేపీకి ఉన్న అసహనానికి ఇది తిరుగులేని తార్కాణమన్నారు. రాజ్యాంగంపై మాటలు, చేతలు వేర్వేరుగా ఉన్నాయన్నారు. సంఘ్ పరివార్‌ను మెప్పించి రహస్య అజెండా అమలులో భాగంగానే లౌకికవాదం, సమాజవాదానికి తిలోదకాలు ఇస్తున్నారంటూ బీజేపీని విమర్శించారు. 1949 రాజ్యాంగ ప్రతినే ఎంపీలకు అందజేశామన్న బీజేపీ వ్యాఖ్యలు సమర్థనీయం కాదన్నారు. 1972లో రాజ్యాంగ సవరణ జరిగిందని ఇందులో లౌకిక, సమాజవాద పదాలను చేర్చారని సీఎం గుర్తు చేశారు. రాజ్యాంగంలో లౌకిక, సమాజవాద పదాలను తొలగించడం ద్వారా కేంద్రం భారతరత్న అంబేడ్కర్‌ను కూడా అవమానించిదన్నారు. రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నంలో భాగంగానే బీజేపీ తన రహస్య అజెండాను తెరపైకి తెచ్చిందన్నారు. ఈ విషయంలో దేశంలోని రాజ్యాంగ ప్రియులంతా అప్రమత్తంగా ఉం డాలని ఆయన పిలుపునిచ్చారు.