CM Siddaramaiah: అసలు విషయాన్ని తేల్చి చెప్పిన సీఎం సిద్దరామయ్య.. ఇంతకీ ఏంటా సంగతంటే..

ABN , First Publish Date - 2023-06-20T12:18:49+05:30 IST

రాష్ట్రంలో అన్నభాగ్య పథకానికి అవసరమైన బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచే కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(C

CM Siddaramaiah: అసలు విషయాన్ని తేల్చి చెప్పిన సీఎం సిద్దరామయ్య.. ఇంతకీ ఏంటా సంగతంటే..

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అన్నభాగ్య పథకానికి అవసరమైన బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచే కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) తేల్చి చెప్పారు. వారం రోజులుగా ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాలనే ప్రయత్నాలకు స్వస్తి పలికారు. సోమవారం సాయంత్రం ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సాగిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం మీడియాతో మాట్లాడుతూ కేంద్ర సంస్థల నుంచే బియ్యం కొనుగోలు చేస్తామన్నారు. నేషనల్‌ కన్స్యూమర్‌ కో-ఆపరేటివ్‌ ఫెడరేషన్‌ (ఎన్‌సీసీఎఫ్), నేషనల్‌ అగ్రికల్చర్‌ కో-ఆపరేటివ్‌ మార్కెటింగ్‌ కమిటీ (నాఫెడ్‌), ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ)తోపాటు ఇతర సంస్థలతో అవసరమైన బియ్యాన్ని కొనుగోలు చేస్తామన్నా రు. ఎఫ్‌సీఐ కిలో రూ.34కు సమకూరుస్తుందని, రవాణా ఖర్చులు రూ.2.60 ఉంటాయన్నారు. దీన్నిబట్టి బియ్యం కిలో రూ.36.60 కానుందన్నారు. మూడు సంస్థల ధరల వివరాలను ఆహ్వానించి టెండర్ల ద్వారా బియ్యం కొనుగోలు చేస్తామన్నారు. ప్రస్తుతం అన్నభాగ్య ద్వారా బీపీఎల్‌ కార్డుదారులకు 5 కిలోల బియ్యం పంపిణీ చేస్తామని, మిగిలిన 5 కిలోలు జొన్నలు, రాగులు పంపిణీపై చర్చించామన్నారు. అన్నభాగ్య పథకానికి ఏడాదికి రూ.10,092 కోట్లు కానుందన్నారు. కేంద్రప్రభుత్వ అనుబంధమైన ఎఫ్‌సీఐ వద్ద బి య్యం నిల్వలు ఉన్నాయన్నారు. సమాఖ్య వ్యవస్థలో సహకారం ఇవ్వాలని, కానీ కేంద్రం పేదలకు అందించే బియ్యం పంపిణీలో రాజకీయం చేస్తోందన్నారు. చత్తీస్‏ఘఢ్‌ రాష్ట్రంలో 1.5 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం నిల్వలు ఉన్నాయని, అవి పూర్తిగా సరిపోవన్నారు. పంజాబ్‌ రాష్ట్రం నుంచి కూడా బియ్యం విషయమై చర్చిస్తున్నామన్నారు.

Updated Date - 2023-06-20T12:18:50+05:30 IST