CM Siddaramaiah: సీఎం సిద్దూ సంచలన కామెంట్స్.. ‘అడ్జస్ట్‌మెంట్’ రాజకీయాలకు దూరం.. నిరూపిస్తే గుడ్‌బై
ABN , First Publish Date - 2023-07-13T12:11:04+05:30 IST
అడ్జస్ట్‌మెంట్ రాజకీయాలు తనకు తెలియవని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకునేందుకు సిద్ధమని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Min
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): అడ్జస్ట్‌మెంట్ రాజకీయాలు తనకు తెలియవని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకునేందుకు సిద్ధమని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) శాసనసభలో ప్రకటించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం చర్చలో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్‌డీ కుమారస్వామి(HD Kumaraswamy) ప్రసంగిస్తున్న సమయంలో జోక్యం చేసుకున్న సిద్దరామయ్య అడ్జస్ట్‌మెంట్ రాజకీయాలు తనకు ఏమాత్రం గిట్టవన్నారు. ప్రతిపక్షనాయకుడిగా ఉన్న సమయంలోనూ అప్పటి ముఖ్యమంత్రులు, మంత్రుల ఇళ్లకు వెళ్లలేదని స్పష్టం చేశారు. 1983 నుంచి శాసనసభ సభ్యుడిగా ఉన్నానని అప్పటి నుంచి రాజకీయాల్లో విలువలు కాపాడుకుంటూ వస్తున్నా అన్నారు. జేడీఎస్ నుంచి బయటపడ్డానికి కారణాలు వేరన్నారు. అంతకు ముందు కుమారస్వామి ప్రసంగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ ఐదు గ్యారెంటీ పథకాలు అవకతవకలుగా సాగుతున్నాయని విరుచుకుపడ్డారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.