CM Siddaramaiah: బీజేపీతో జేడీఎస్ ఎందుకు చేతులు కలిపిందో..?
ABN , First Publish Date - 2023-07-22T13:08:37+05:30 IST
శాసనసభలో ప్రతిపక్షాల పాత్ర కీలకమైనదని, ప్రభుత్వం చేసే తప్పిదాలను ప్రశ్నించే అవకాశం సమావేశాల్లో ఉంటుందని, బీజేపీ వ్యూహాత్మకంగా
బెంగళూరు: శాసనసభలో ప్రతిపక్షాల పాత్ర కీలకమైనదని, ప్రభుత్వం చేసే తప్పిదాలను ప్రశ్నించే అవకాశం సమావేశాల్లో ఉంటుందని, బీజేపీ వ్యూహాత్మకంగా రెండు రోజులుగా బహిష్కరించిందని ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) పేర్కొన్నారు. ఇటీవల జాతీయస్థాయి ముఖ్యులు బెంగళూరుకు వచ్చినప్పుడు స్టేట్‌గెస్ట్ గా ఐఏఎస్ అధికారులను నియమించామని, ఇందులో ఏం తప్పుందని బీజేపీ వ్యతిరేకిస్తోందన్నారు. 2019లో బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ భేటీ జరిగిందని, అప్పటి కేంద్రమంత్రి అనంతకుమార్ స్టేట్‌గెస్ట్ గౌరవం ఇవ్వాలని కోరారన్నారు. 2018లో కుమారస్వామి(Kumaraswamy) ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు దేశంలోని ప్రముఖులు వచ్చారని, అప్పుడు ఇదే సంప్రదాయం కొనసాగిందన్నారు. బీజేపీ నేతలు ప్రతిపక్షనేతను ఖరారు చేసే విషయంలో విఫలం చెంది, ప్రశ్నిస్తామనే వారు పథకం ప్రకారం సభకు గైర్హాజరయ్యారన్నారు. కానీ జేడీఎస్ వారితో ఎందుకు చేతులు కలిపిందో అంటూ ఎద్దేవా చేశారు. మహాత్మాగాంధీని హత్య చేసిన గాడ్సేను కొనియాడే వారు గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేస్తున్నారని విమర్శించారు.