Share News

CM's warning: మంత్రులూ.. జాగ్రత్త.. నోరు తెరవద్దు...

ABN , First Publish Date - 2023-11-05T12:52:58+05:30 IST

నాయకత్వ మార్పుతో పాటు రాజకీయ అంశాలపై మంత్రులు ఎవరూ నోరు తెరవద్దు అంటూ ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) హెచ్చరించారు.

CM's warning: మంత్రులూ.. జాగ్రత్త.. నోరు తెరవద్దు...

- బ్రేక్‏ఫాస్ట్ మీటింగ్‏లో సీఎం హెచ్చరిక

- జిల్లాల్లో కరువుపై అధ్మయనం చేయండి

- ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): నాయకత్వ మార్పుతో పాటు రాజకీయ అంశాలపై మంత్రులు ఎవరూ నోరు తెరవద్దు అంటూ ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Chief Minister Siddaramaiah) హెచ్చరించారు. గడిచిన వారం రోజులుగా ముఖ్యమంత్రి పదవిపై సాగుతున్న వ్యాఖ్యలకు చెక్‌ పెట్టాలనే ఉద్దేశ్యంతోనే కావేరి అతిథి గృహంలో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కావేరి అతిథి గృహంలో కొత్తగా నిర్మించిన మీటింగ్‌ హాల్‌ను సీఎం సిద్దరామయ్య దగ్గరుండి మరీ డీసీఎం డీకే శివకుమార్‌ ద్వారా ప్రారంభించారు. తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌ ముగించి సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో రాజకీయ అంశాలపై ఎవరికి వారుగా మాట్లాడి గందరగోళం చేయకండి అంటూ డీసీఎం డీకే శివకుమార్‌ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. సీఎం సిద్దరామయ్య కూడా అధిష్టానం సూచిస్తే ఐదేళ్లు సీఎంగా ఉంటానని చేసిన వ్యాఖ్యలను మీడియా తిప్పి రాసిందని వివరణ ఇచ్చిన విషయాన్ని డీసీఎం ప్రస్తావించారు. ముఖ్యమంత్రి పదవి మాత్రమే కాదని, ఎలాంటి పదవులు దక్కాలన్నా అధిష్టానం సూచిస్తేనే సాధ్యమవుతుందనేది గుర్తుంచుకోవాలన్నారు. ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించిన తరహాలోనే మంత్రులు కూడా మీడియాతో ఇష్టారాజ్యంగా మాట్లాడటం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. పరోక్షంగా సహకార శాఖ మంత్రి రాజణ్ణను టార్గెట్‌ చేసినట్లుగానే డీసీఎం వ్యాఖ్యానించినట్లు సమాచారం. సీఎం, డీసీఎం పదవులు ఎప్పుడు ఎవరికి కేటాయించాలనేది అధిష్టా నం నిర్ణయిస్తుందన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన గ్యారెంటీలను రాజఽధాని బెంగళూరు నుంచి మారుమూల గ్రామం దాకా ప్రతి లబ్ధిదారుడికి అందుతోందా లేదా పర్యవేక్షించాలని హితవు పలికారు. శతాబ్దంలోనే అత్యంత తీవ్రమైన కరువు వచ్చిందని, మంత్రులు జిల్లాల వారిగా సమగ్ర నివేదికలను సిద్ధం చేయాలని సూచించారు. ప్రతిపక్ష పార్టీ వారు కరువు పరిస్థితిపైనా రాజకీయం చేసేలా పర్యటిస్తున్నారని, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన ఎమ్మెల్యేలు, మం త్రులు మౌనంగా ఉంటూ రాజకీయ అంశాలపై మాట్లాడటం ఎంతవరకూ సమంజసమన్నారు.

pandu1.jpg

లోక్‌సభ ఎన్నికలపై మంత్రులతో చర్చించాం: సీఎం

లోక్‌సభ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో మంత్రులు జిల్లాఇన్‌చార్జిలుగా వ్యవహరిస్తున్నారని, వారి పరిధిలో తీసుకోవాల్సిన అన్ని అంశాలపైనా చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేశామని అనంతరం ముఖ్యమంత్రి సిద్దరామయ్య మీడియాకు తెలిపారు. కావేరి అతిథి గృహంలో మీటింగ్‌హాల్‌ను నిర్మించామని, దానిని ప్రారంభించడంతో పాటు సమావేశం నిర్వహించామన్నారు. కరువు పరిస్థితిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సూచించామన్నారు. ప్రస్తుతం 16 మంది మంత్రులను ఆహ్వానించామని, సతీశ్‌ జార్కిహోళి అనారోగ్యం కారణంగా రాలేదన్నారు. మిగిలిన వారంతా భాగస్వామ్యులయ్యారన్నారు. మిగిలిన మంత్రులతో వచ్చే శనివారం సమావేశం నిర్వహిస్తామన్నారు. పార్టీలో ఎటువంటి విభేదాలు లేవని సమాధానం దాటవేశారు. కాగా సీఎం బ్రేక్‌ఫాస్ట్‌ మీటింగ్‌కు హాజరైన మంత్రులలో బోసురాజు, రామలింగారెడ్డి, దినే్‌షగుండూరావు, కృష్ణభైరేగౌడ, జమీర్‌అహ్మద్‌ఖాన్‌, సంతోష్‏లాడ్‌, ఏఎంబీ పాటిల్‌, ఈశ్వర్‌ఖండ్రే, పరమేశ్వర్‌, భైరతి సురేష్‌, మునియప్ప, కేజే జార్జ్‌, కేఎస్‌ రాజణ్ణ, హెచ్‌సీ మహదేవప్ప, ప్రియాంకఖర్గే హాజరయ్యారు. డీసీఎం డీకే శివకుమార్‌ మంత్రుల తీరుపట్ల సుదీర్ఘంగా మాట్లాడటమే కాకుండా తీవ్రస్థాయిలోనే హెచ్చరికలు జారీ చేశారు. లక్ష్మణరేఖ దాటితే ఎంతటి వారిపైన అయినా క్రమశిక్షణ చర్యలు తప్పవనే సంకేతం ఇచ్చినట్లు సమాచారం.

Updated Date - 2023-11-05T12:52:59+05:30 IST